బాలికపై కామాంధుల ఘాతుకం.. 20 ఏళ్ల జైలు

2 Men Sentenced To 20 Years Of Jail Over Molestation Karnataka - Sakshi

మైసూరు: ఇద్దరు కామాంధులకు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ  మైసూరు జిల్లా ఒకటవ సెషన్స్‌ కోర్టు  తీర్పు ఇచ్చింది.  మైసూరులోని ఎన్‌.ఆర్‌.మోహల్లా పోలీస్‌ సేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న జై శివ మహాదేవ(55), కైసర్‌ పాషా(33) అనే వ్యక్తులు మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను ఎస్‌.ఆర్‌.మొహల్లా పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణకు రాగా నిందితుల నేరం రుజువైంది. దీంతో శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

సజీవ దహనం నిందితుడు మృతి 
యశవంతపుర: నాలుగు రోజుల కిందట కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా నాకూరు సమీపంలోని ముగుచికేరి గ్రామంలో ఒక వ్యక్తి బావమరిది ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో భార్య, ఇద్దరు పిల్లలు, బావమరిది కుటుంబంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. చివరికి అతడు కూడా చనిపోయాడు. అతని మృతదేహాన్ని సమీపంలోని కాఫీ తోటలో పోలీసులు కనుగొన్నారు. ఈ నెల మూడున ముగుచికేరిలో పెట్రోల్‌ పోసి హత్యాకాండకు పాల్పడిన నిందితుడు ఎరవర జోజ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి నిందితుని కోసం పోలీసులు గాలిస్తుండగా అతడు కూడా ప్రాణాలు విడవడంతో కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకు హత్యాకాండకు పాల్పడ్డాడో బయటపడే అవకాశం లేకపోయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top