రాహుల్‌ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు | 11 More Victims Producing To Court Rahul Assassination Case Vijayawada | Sakshi
Sakshi News home page

రాహుల్‌ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు

Aug 27 2021 12:50 PM | Updated on Aug 27 2021 1:33 PM

11 More Victims Producing To Court Rahul Assassination Case Vijayawada - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: జిల్లాలో వ్యాపారి రాహుల్‌ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 11 మంది నిందితులని పోలీసులు నేడు కోర‍్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యం అరెస్ట్‌ కాగా.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌ కుమార్‌, గాయత్రి, సీతయ్య, సుబ్బారావులతో పాటు మరో ఆరుగురిని గుర్తించారు. వీరందరిని  వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం కోర్టు ముందుకు తీసుకురానున్నారు.

అనంతరం రాహుల్‌ హత్య కేసుపై కమిషనర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే రాహుల్‌ను హత్య చేశారని, సాక్ష్యాదారాలను తారుమారు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు సీసీటీవీ, బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా ఇప్పటికే వెల్లడించారు. 

చదవండి: రాహుల్‌ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement