అండగా ఉంటాం.. భయపడొద్దు | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. భయపడొద్దు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

● కుప్పం వైఎస్సార్‌ సీపీ నేతలకు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి భరోసా

కుప్పం: ఎవరూ అధైర్య పడొద్దు, అండగా ఉంటాం అని కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్‌ సీపీ నాయకులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆ పార్టీ నాయకులు బుధవారం మాజీ మంత్రితోపాటు ఎంపీని తిరుపతిలో కలిసి కుప్పం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం జరిగిన దౌర్జన్య కాండను వివరించారు. నామినేషన్ల పర్వం నుంచి పరిశీలన వరకు జరిగిన కిడ్నాప్‌లు, నామినేషన్‌ పత్రాల చింపివేత, బలవంతపు ఉపసంహరణలు, ఎన్నికల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాల గురించి తెలియజేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లను బయటికి పంపి అధికారులు, కూటమి నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును తెలిపారు. తమ అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లు వచ్చినా చివరి ఫలితాల్లో ఓడిపోయినట్లు ఆర్వో డిక్లరేషన్‌ ఇచ్చారని వాపోయారు. రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి స్పందించి ఎవరూ అధైర్య పడొద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని, తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు చెప్పారు. ఎవరైతే అధికారులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారో వారిపై 2029 ఎన్నికల తర్వాత విచారణ చేసి చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము ఉన్నామని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్‌ అధ్యక్షులు హఫీజ్‌, ఉపాధ్యక్షులు మునిరాజు, చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు సీపీ మనోహర్‌, హనుమంతు, ప్రభాకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement