ఇబ్బంది పెట్టినవారికి అసలు, వడ్డీ తప్పదు! | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పెట్టినవారికి అసలు, వడ్డీ తప్పదు!

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

మహిళలపై రుబాబు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ

పలమనేరు : ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఇబ్బంది పెట్టిన టీడీపీ నాయకులకు రాబోవు రోజుల్లో అసలు, వడ్డీ తప్పక చెల్లిస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.వెంకటేగౌడ హెచ్చరించారు. ఆయన బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు కూటమి నేతల బెదిరింపులు సాగాయన్నారు. మహిళలపైనా బెదిరింపులకు దిగారని తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటకు పంపడం, దొంగ ఓట్లు వేసుకోవడం చేశారని, జాతీయ మీడియా ఏపీ ఎన్నికల తీరును చూసి ఏకిపారేస్తోందన్నారు. ఇలాంటి ఎన్నికలు చేసే బదులు నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చుకోడం మేలని చురకలింటించారు. మున్సిపాలిటీలో బరిలో నిలచి గెలిచిన, ఓడిన అభ్యర్థులను ఎన్నటికీ మరువనని, వారికే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. అధికారం మళ్లీ రాదని కూటమి నేతలకు అర్థమైందని, అందుకే అక్రమాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. 2029లో అధికారం వైఎస్సార్‌ సీపీదేనని, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో మురళీకృష్ణ, చెంగారెడ్డి, జాఫర్‌, కమాల్‌, రాజేష్‌, శ్యామ్‌, వీరభద్ర, నియాజ్‌, సల్మా, హైదర్‌, పురుషోత్తం పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,806 మంది స్వామిని దర్శించుకున్నారు. 18,564 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.63 కోట్లు లభించాయి. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఉన్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లున్న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement