కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను
భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ
నామినేషన్ల రోజు నుంచి పోలింగ్ వరకు బెదిరింపులు, దాడులు
దొంగ సంతకాలతో 13 నామినేషన్ల ఉపసంహరణ, టీడీపీ ఏకగ్రీవం
పరిశీలన రోజు చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్
ప్రచారానికి ఇంటి నుంచి బయట రాకుండా కట్టడి
పోలింగ్ రోజు అధికార పార్టీ నేతల రిగ్గింగ్
అయినా అభిమానం చాటుకున్న ఓటర్లు
కుప్పం: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు భయానక వాతావరణం సృష్టించి..వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడి.. కిడ్నాప్ చేసి.. ప్రచారం చేసేందుకు ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించినా... కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థికి ఊహించని స్థాయిలో ఓట్లు పడడం టీడీపీ స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆదరణ ఏమాత్రం తగ్గలే దని స్పష్టమైంది. ఎన్నికలు నిర్వహించిన 19 వార్డుల్లో, చైర్మన్ ఎన్నికలకు నామమాత్రపు పోటీ కూడా రాకుండా వైఎస్సార్‌సీపీని కట్టడి చేసేందుకు శతవిధాలుగా టీడీపీ నాయకులు ప్రయత్నించారు. కుప్పం ఓటర్లు మాత్రం తమకు వైఎస్సార్‌సీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
చైర్మన్ అభ్యర్థికి 7 వేల ఓట్లు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటరు నేరుగా చైర్మన్ అభ్యర్థి ఓటు వేసే విధానాన్ని ఈ ఎన్నికల్లో తీసుకొచ్చారు. ఈక్రమంలో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా విజయ్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ బరిలో నిలిపింది. ఆయనకు 7,088 ఓట్లు లభించాయి.
వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థికి పోలైన ఓట్లు
జీర్ణించుకోలేని టీడీపీ
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. నామినేషన్లు మొదలైన రోజు నుంచి పోలింగ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. దాడులకు పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలు చించివేశారు. దొంగ సంతకాలు చేసి 13 మంది ఉపసంహరించుకున్నట్టు సృష్టించారు. చైర్మన్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. ప్రచారం చేసుకునేందుకు కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేసుకున్నారు. అయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఓటర్లు అభిమానం చాటుకున్నారు. చైర్మన్ అభ్యర్థికి లభించిన ఓట్లు చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అన్ని విధా లుగా అష్టదిగ్బంధనం చేసినా చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్‌కు పోలైన ఓట్లు చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించి నామినేషన్లకే పరిమితం చేశారు. అయినా జనం వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అధికార పార్టీ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి, ప్రలోభాలు గురిచేసినా ప్రజలు ఓట్లు వేసి వాటిని తిరస్కరించినట్లు మేధావులు, పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్‌కుమార్‌ను కూటమి నాయకులు నానా ఇబ్బందులకు గురిచేశారు. నామినేషన్ వేసి రోజు నుంచి ఓట్ల లెక్కింపు రోజు వరకు వైఎస్సార్‌సీ అభ్యర్థులను బెదిరించారు. నామినేషన్ల పరిశీలన రోజు చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్ కిడ్నాప్ చేసి కుప్పంలో బీభత్సం సృష్టించారు. కౌన్సిలర్ అభ్యర్థులు, వారిని బలపరచిన వారు అందుబాటులో లేకపోయినా, టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు సంతకాలు చేసి 13 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరింపజేసి ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మున్పిపల్ ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల ముందు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ ప్రచారానికి రాకుండా అధికార పార్టీ నేతలు కట్టడి చేశారు. 19 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థి కనీసం కరపత్రాలు కూడా పంపిణీ చేయలేక పోయారు. అంతేకాకుండా పట్టణంలో కనీసం ప్రచార రథానికి అనుమతి ఇవ్వవలేదు. అభ్యర్థిని ప్రచారం చేయనివ్వకుండా, పోలింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించకుండా హౌస్ అరెస్టులు చేసి భయాందోళనలకు గురిచేశారు. 19 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థి ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ రోజున మధ్యాహ్నం తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు తరిమేసి దొంగ ఓట్లు వేసుకున్నారు. ఇన్ని అడ్డంకులు..అరాచకాలు సృషించినా బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థికి లభించిన ఓట్లు అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చాయని జనం అనుకుంటున్నారు.


