ఓట్ల రిగ్గింగ్‌ అంటే సినిమాల్లో చూడడం.. మాకాలంలో అని ఎవరైనా చెబితే వినడం తప్ప ఈ తరానికి ప్రత్యక్ష్య అనుభవం లేదు. కూటమి నేతల దుర్మార్గపు ‘ ఆలోచనలో అది జిల్లా వాసులు చవిచూశారు. అధికారం చేతిలో ఉంటే ఎంతటి అన్యాయం, దౌర్జన్యమైనా చేయొచ్చని టీడీపీ నేతలు నిరూపించా | - | Sakshi
Sakshi News home page

ఓట్ల రిగ్గింగ్‌ అంటే సినిమాల్లో చూడడం.. మాకాలంలో అని ఎవరైనా చెబితే వినడం తప్ప ఈ తరానికి ప్రత్యక్ష్య అనుభవం లేదు. కూటమి నేతల దుర్మార్గపు ‘ ఆలోచనలో అది జిల్లా వాసులు చవిచూశారు. అధికారం చేతిలో ఉంటే ఎంతటి అన్యాయం, దౌర్జన్యమైనా చేయొచ్చని టీడీపీ నేతలు నిరూపించా

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

పుర పోరులో బరితెగింపు చిత్తూరు చరిత్రలో ఇదే ప్రథమం కుప్పంలో రిగ్గింగ్‌కు విద్యుత్‌ ఆపేసి రెస్కో సహకారం ప్రజా తీర్పు కాలరాసి.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు పోలింగ్‌ డైరీలో రాయని పీవోలు.. సాక్ష్యాలున్నా ఖాకీల మౌనం

సాక్షి, చిత్తూరు: పుర పోరులో అధికార పార్టీ నాయకులు పక్కా ప్రణాళికతో చివరి రెండు గంటల్లో బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. జిల్లాలో ఆదివారం జరిగిన కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. రిగ్గింగ్‌కు పాల్పడ్డ పోలింగ్‌ బూత్‌లలో లోపల అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. వెలుపల పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.

ఎప్పుడో 39 ఏళ్ల క్రితం నాటి చరిత్ర. చిత్తూరు ఉమ్మడి జిల్లా. దాదాపు 66 మండలాలు. నాటి చిత్తూరులో ఎన్నికలన్నా.. పోలింగ్‌ పేరు చెప్పినా ప్రజల్లో భయం ఉండేది. పోలింగ్‌ సమయంలో రిగ్గింగ్‌ అంటే ఎట్లా ఉంటుందో చిత్తూరులో ఇప్పుడు 60–70 ఏళ్ల వయస్సు పైబడ్డ వాళ్లను అడిగితే చెబుతారు. అప్పట్లో చిత్తూరు మునిసిపాలిటీలో 14కు పైగా కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యాయి. గుజ్జర్లపుడి అల్‌ఫ్రెడ్‌ అప్పటి చిత్తూరు ఎస్పీ. ఇక ఒక్కస్థానం ఏకగ్రీవమైనా ఒప్పుకునేదిలేదని గట్టిగా నిలబడ్డారు. ఇపుడు ఇదంతా ఎందుకంటారా..?

ఒకరు ఏకగ్రీవమైనా సంతృప్తి చెందక..

నగరిలో కెజే కుటుంబం నుంచి ఒకరు ఏకగ్రీవమైనా సంతృప్తి చెందని ఆ కుటుంబం, మరొకరిని గెలిపించడానికి రిగ్గింగ్‌ను, దొంగ ఓట్లను ఎంచుకుంది. జిల్లా చరిత్రలో తొలిసారిగా నగరిలో 78 శాతం పోలింగ్‌ దాటింది.

బూత్‌ల ఆక్రమణ

పలమనేరులో 37కు పైగా బూత్‌లను స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టి, బయటకు పంపించేసి ఓట్లను దోచుకున్నారు. దాదాపు 73 శాతం పోలింగ్‌ నమోదడం పలమనేరులో ఇదే ప్రపథమం.

పుత్తూరులో పట్టించుకోని పోలీసులు

తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా టీడీపీ నాయకులు మధ్యాహ్నం 3 గంటల తర్వాత విచ్చలవిడిగా దొంగోట్లు వేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోనే లేదు.

కుప్పంలో కూర్చోబెడితే ఒట్టు

చిత్తూరు తరువాత కుప్పం మునిసిపాలిటీలో సైతం భారీగా దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ జరిగింది. 77 శాతానికి పైగా పోలింగ్‌తో కుప్పం, జిల్లాలో అత్యంత ఎక్కువ మంది ఓట్లు వేసి మునిసిపాలిటీగా గణాంకాలు నమోదు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తరువాత పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించేశారు. అగ్నికి వాయువు తోడైతే ఆ జ్వాల ఎలా ఉంటుందో.. కుప్పం రెస్కో రిగ్గింగ్‌లో కీలక పాత్ర పోషించింది. సాయంత్రం కుప్పం పట్టణం మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. ఇక గెలవాల్సిన అభ్యర్థుల రాతను టీడీపీ నేతలు రాసేశారు. ఏ బూత్‌లో ఎంత మెజారిటీ రావాలి..? ప్రతిపక్షానికి డిపాజిట్‌ రావాలా..? వద్దా..? అనేది కూడా ఫలితాలకు ముందే కుప్పంలో టీడీపీ నేతలు నిర్ణయించారు.

అధికారులు ఏకపక్షం

జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దొంగ ఓట్లు పడుతున్నా, కళ్లెదుటే రిగ్గింగ్‌ జరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక పోలింగ్‌ బూత్‌ల్లో జరిగిన అక్రమాలు, రిగ్గింగ్‌ వీడియోలు బయటకు వచ్చినా కూడా పీవోలు పోలింగ్‌ డైరీలో ఏ ఒక్క అంశాన్ని నమోదు చేయలేదు. తమకెందులే అన్నట్టు.. ప్రత్యక్ష్య వీడియోలు రిగ్గింగ్‌ వైనాన్ని బహిర్గతం చేసినా, ఎక్కడా రీ–పోలింగ్‌ పెట్టలేదు. పోస్టింగులు కాపాడుకోవానికి కొందరు, పార్టీ పెద్దలపై స్వామిభక్తి చూపించడానికి మరికొందరు మౌనమే మార్గంగా ఎంచుకున్నారు.

జిల్లా కేంద్రంలో తొలిసారి..

దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత చిత్తూరు మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఏకంగా 51 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. గూండాయిజం, రౌడీయిజంతో ఓట్లు లాక్కుని రిగ్గింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. వీటిని చూసిన పోలీసులు ప్రశ్నించలేదు. అన్నీ తెలిసిన అధికారులు నోరు మెదపడంలేదు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన పోలింగ్‌కు 175 బూత్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఉదయం నుంచి ఓ పద్ధతి ప్రకారం ప్రతిచోట దొంగ ఓట్లు వేస్తూ వచ్చారు. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల తరువాత చిత్తూరులో కేవలం 11 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. దాని తరువాత 11 గంటలకు ఒక్కసారిగా 32 శాతం దాటేసింది. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు 36 శాతం.. 3 గంటలకు ఏకంగా 51 శాతం, పోలింగ్‌ ముగిసే సమయానికి 62 శాతం దాటేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఓటింగ్‌లో దిగువ శ్రేణి వర్గం తప్ప.. మధ్య తరగతి, ఎగువ శ్రేణి వర్గాలు 20 శాతం కూడా పాల్గొనలేదు. నగరంలో 51 డివిజన్లు ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం కావడంతో విద్యావంతులు సైతం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇది అధికార పార్టీ నేతలకు కలసి వచ్చింది. ఒక్కో బూత్‌లో సగటున వంద వరకు దొంగ ఓట్లు వేసి, చివరి రెండు గంటల్లో సగటున మరో 50 ఓట్లు చొప్పున రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వళ్లియప్పనగర్‌ లాంటి బూత్‌లో వీడియోలు బయటకొచ్చాయి. కానీ వీడియోలు తీయని వందకు పైగా బూత్‌ల్లో ఇదే రిగ్గింగ్‌ కొనసాగింది. ఇందుకోసం పచ్చ నేతలు శిక్షణ ఇచ్చిన కిరాయి మూకలు ప్రత్యేకంగా పనిచేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement