మున్సిపల్స్‌.. లబ్‌డబ్‌..! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్స్‌.. లబ్‌డబ్‌..!

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

నేడు జిల్లాలోని ‘పుర’ తీర్పు వెల్లడి 94 వార్డులు.. 257 మంది అభ్యర్థుల భవిత తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌.. ఆపై బ్యాలెట్‌ లెక్కింపు ఉదయం 8 నుంచే లెక్కింపు.. మధ్యాహ్నానికి పూర్తి లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌.. మద్యం బంద్‌ చిత్తూరు మేయర్‌.. పలమనేరు–కుప్పం కుర్చీలవైపు ఆసక్తి

సాక్షి, చిత్తూరు: మునిసిపల్‌ ఎన్నికలు ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడంతో ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలిచిందనే దానిపై ఎవరూ పట్టించుకోవడం లేదు. శాసించే కుర్చీ ఎవరికి దక్కుతుందని సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మరి కొన్ని గంటల్లో అది కూడా తేలిపోనుంది. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.

ఆ మూడింటిపైనే చూపు

జిల్లా మొత్తంలో 168 వార్డులుంటే 74 వార్డులు ఏకగ్రీవాలయ్యాయి. అలాగే నగరి చైర్మన్‌ కూడా ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 94 వార్డులకు ఈనెల 1వ తేదీన ఎన్నికలు జరగడంతో ప్రధాన పోటీ కూటమి–వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్యే ఉంది. వార్డులు, డివిజన్లలో ఎవరు గెలుస్తారనే విషయం ఓవైపు.. జిల్లా కేంద్రమై చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠత నెలకొంది. అలాగే పలమనేరు, కుప్పం ఛైర్మన్‌ కుర్చీలపై సైతం ఆసక్తి నెలకొంది. మొత్తం 94 వార్డుల్లో జరిగిన ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మొత్తం 257 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అందరూ కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లోని 9 డివిజన్లకు పోలింగ్‌ జరగ్గా 47 మంది పోటీ చేశారు. నగరి మున్సిపాలిటీలో 36 వార్డులకు 108 మంది, పలమనేరులోని 30 వార్డులకు 64 మంది, కుప్పంలోని 19 వార్డులకు 38 మంది పోటీ చేశారు.

ఆంక్షలు..

లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. సాయంత్రం వరకు పట్టణాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదని ఎకై ్సజ్‌ శాఖ పేర్కొంది. ఇక ఫలితాలు వెలువడ్డ తరువాత ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా పేల్చి ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం చేయకూడదని ఇప్పటికే పోలీసు శాఖ పేర్కొంది.

మున్సిపాలిటీ టేబుళ్ల రౌండ్లు మేయర్‌/ వార్డులు కౌంటింగ్‌్‌ కౌంటింగ్‌ మైక్రో

సంఖ్య చైర్‌పర్సన్‌ సూపర్‌వైజర్లు సహాయకులు పరిశీలకులు

చిత్తూరు 31 4 4 44 88 44 176

కుప్పం 16 6 2 16 32 16 64

నగరి 18 0 2 22 44 22 88

పలమనేరు 30 5 5 34 68 34 136

మొత్తం 95 15 13 116 232 116 464

లెక్కింపు ఇలా..

అన్ని చోట్ల కూడా తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. తరువాత పెట్టెల్లో ఉన్న బ్యాలెట్‌ పత్రాలను బయటకు పోసి.. ప్రతి వెయ్యి ఓట్లను ఓ బండిల్‌గా కట్ట కడుతారు. అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్లను వేరుచేసి లెక్కింపు మొదలుపెడుతారు. మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లకు ఇప్పటికే అధికారులు గుర్తింపు కార్డులు జారీచేశారు. వీళ్లు మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి రావాలి. సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు. ప్రతి కేంద్రం వద్ద మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement