నిండ్ర (నగరి): తిరు పతి తారకరామా స్టేడియంలో గురువారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలలో నిండ్ర జెడ్పీ ఉన్నత పాఠశా ల విద్యార్థిని పి.యామి ని అద్భుత ప్రతిభ కనబరిచింది. అండర్–17 బాలికల విభాగంలో 100 మీటర్ల పరుగు పందెం, 400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రథమ స్థానాలను కై వసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 28వ తేదీన కర్నూలులో చేపట్టనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో యామిని ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు వి.శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. యామినితోపాటు పీడీ జ్ఞానకుమార్‌ను అభినందించారు.
రోడ్డుప్రమాదంలో
ఇద్దరు యువకుల మృతి
గుడిపాల: మండలంలోని 197 రామాపురానికి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం వెంగమాంబపురం వెళుతుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న హరీ ష్(17),మహేష్(17) ద్విచక్రవాహనంలో వెళు తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన నిలిపి ఉన్న జేసీబీని ఢీకొన్నారు. దీంతో అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 65,113 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,391 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూ లోకి అనుమతించరని స్పష్టంచేసింది.
తిరుమల జలాశయాలకు జలకళ
తిరుమల: తిరుమలలోని ప్రధాన జలాశయాలకు వర్షపు నీరు చేరుతుండడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాల్లో కలిపి 61.68 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది. ఇందులో 21.6 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా.. మిగిలిన 40.08 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. జలాశయాల పరిధిలో నమోదైన వర్షపాతం నీటి నిల్వల పెరుగుదలకు దోహదపడింది. ఆకాశగంగ డ్యామ్ పరిధిలో 8 మి.మీ వర్షపాతం నమోదైంది. కొండపై నీటి కష్టాలు తీరినట్టే అని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


