పచ్చస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

పచ్చస్వామ్యం

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

మూడు రోజులపాటు కొనసాగిన టీడీపీ గూండాయిజం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ బరితెగింపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు పుంగనూరులో ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ చివరి రోజు రంగంలోకి దిగి నామినేషన్లు వేయించిన కలెక్టర్‌, ఎస్పీ

వికటాట్టహాసం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో మూడు రోజులుగా సాగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషనన్ల ప్రక్రియ ఉద్రిక్తతలు, భయాందోళనలు, భౌతిక దాడుల నడుమ శుక్రవారంతో ముగిసింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన స్థానిక సంస్థల నామినేషన్ల పర్వాన్ని టీడీపీ రౌడీలు అరాచకపర్వంగా మార్చేశారు. అభ్యర్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో నామినేషన్‌న్‌ వేసే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, ఏమాత్రం లెక్కచేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

ఆఖరి రోజూ బరితెగింపు

నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారం కూడా జిల్లా లోని వివిధ నామినేషన్‌ కేంద్రాల వద్ద బెదిరింపు లు, భౌతిక దాడులు, నామినేషన్‌ పత్రాలు చించివేయడం, అపహరించడం వంటి ఘటనలకు టీడీపీ గూండాలు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, చివరికి తమ కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్థుల ను సైతం వదలకుండా దాడులకు దిగడం గమనార్హం.

కొనసాగిన దౌర్జన్యం

జిల్లా వ్యాప్తంగా ఆఖరి రోజు శుక్రవారం ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలా ల్లోని ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రాల వద్ద పచ్చమూక దౌర్జన్యాలు తీవ్రరూపం దాల్చాయి. రొంపిచెర్ల మండలం గానుగ చింత ఎంపీటీసీ సెగ్మెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శివకుమార్‌ నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా మార్గం మధ్యలోనే కిడ్నాప్‌ చేశారు. అదే మండలంలో పోటీలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు రెడ్డెమ్మ, మోతుమల్లెల, జీవలత నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు.

కుప్పంలో 400 మందితో ముట్టడి

కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చి న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను వందలాది మంది టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. శాంతిపురంలో సుమారు 400 మందితో నామినేషన్‌ కేంద్రాన్ని ముట్టడించి భయాందోళనలు సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత పెద్దన్నతో పాటు పలువురిపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేశారు. రామకుప్పంలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను బెదిరించి తరిమికొట్టారు.

కాపు కాసి.. చితకబాది!

కుప్పం: ఎంపీటీసీ నామినేషన్ల పక్రియలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్య కాండ కొనసాగింది. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఎక్కడ దొరికితే అక్కడ పచ్చమూక చితకబాదేసింది. రామకుప్పం మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థులు వస్తు న్నారని తెలుసుకుని కాపు కాసి.. దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేసింది.

భయాందోళనలో అభ్యర్థులు

ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా టీడీపీ రౌడీల దాడులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం మండలం వైఎస్సార్‌ సీపీ నుంచి ఒకే ఓక్క నామినేషన్‌ దాఖలైయింది. 18 ఎంపీటీసీ సెగ్మెంట్లుకు ఒక్కటే వైఎస్సార్‌ సీపీ వేసినట్లు తెలిసింది.. బందార్లపల్లె ఎంపీటీసీకి నామినేషన్‌ వేసేందకు వెళుతున్న హేమాపలపతి, నారాయణ రెడ్డి, మురళి రెడ్డి, ఆశోక్‌ రెడ్డి, ఆనంద రెడ్డిని 30 మంది వరకు టీడీపీ గూండాలు అడ్డగించి చితకబాది నామినేషన్‌ పత్రాలను చించివేశారు. రామకుప్పం మండలం 89 పెద్దూరు ఎంపీటీసీ సెంగ్మెట్‌కు నామినేషన్‌ వేసేందుకు అరుణ్‌ కుమార్‌ సహసం నామినేషన్‌ కేంద్రానికి వెళ్లగా పోలీసులతో మాట్లాడి రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లిపోయారు.

పూతలపట్టులో రోడ్డుపై బైఠాయింపు

మాజీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నామి నేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించివేశారు. దీంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఐరాల మండలంలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థి సుధాకర్‌ నాయుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.

కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షణ

తవణంపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తవణంపల్లెలో నామినేషన్ల ప్రక్రియను ముగింపు రోజు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడీ పర్యవేక్షించారు. కలెక్టర్‌ ఈ మేరకు తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లి నామినేషన్ల సరళిపై ఆరా తీశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ నామినేషన్‌ కేంద్రాల వద్ద పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శాంతిభద్రతలపై చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణరాజు, ఎస్‌ఐ రమేష్‌బాబు పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షణలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. ఈ క్రమంలోనే టీడీపీ అల్లరిమూకలను పోలీసులు తరిమి కొట్టారు.

జిల్లాలో అరాచకంగా నామినేషన్‌ల పర్వం

ఓటమి భయంతోనే దాడులు

పూతలపట్టు(యాదమరి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ రౌడీలు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్‌ మండిపడ్డారు. శుక్రవారం ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి పత్రాలను పచ్చమూక లాక్కుని చించివేసింది. దీనిపై సునీల్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన నామినేషన్ల ప్రక్రియను టీడీపీ నేతలు భయానకంగా మార్చేసారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డితో పాటు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పూతలపట్టు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో కూట మి నేతలు దమనకాండకు దిగుతున్నారని విమర్శించారు.

కూటమి నేతకు తప్పని పరాభవం

జనసేన పార్టీ రాయలసీమ నేత పుష్పవతి యాద మరి జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు చిత్తూరు జెడ్పీ కార్యాలయానికి విచ్చేశారు. ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద కాపుకాచిన టీడీపీ రౌడీలు ఆమె కారు దిగగానే దాడికి యత్నించి, నామినేషన్‌ పత్రాలతో పాటు ఆమె ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు లా క్కొని పారిపోయారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యం ఉండకూడదని ఆమె విమర్శలు గు ప్పించారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీ నేతలకే రక్షణ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement