నగరిలో టీడీపీ రౌడీయిజం! | - | Sakshi
Sakshi News home page

నగరిలో టీడీపీ రౌడీయిజం!

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : నామినేషన్ల ప్రక్రియలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఎన్నికల్లో ప్రజాక్షేత్రానికి వెళ్లాల్సిన తమ్ముళ్లు ఏకగ్రీవం కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నగరిలోని కశింమిట్ట సచివాలయం వద్ద 3వ రోజు ఆదివారం నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసు భద్రత ఉన్నప్పటికీ ఇటీవల టీడీపీలో చేరిన కేజే.కుమార్‌, అతని కుమారులు రౌడీయిజం చేస్తూ 4, 36 వార్డుల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు తామరసెల్వి, ఇంద్రయ్య నామినేషన్‌ పత్రాలను చించేశారు. వైఎస్సార్‌ సీపీ నేత మహేశ్వరన్‌పై దాడిచేశారు. పోటీ చేసే ధైర్యంలేక ఏకగ్రీవం చేసుకోవాలన్న తాపత్రయంతోనే టీడీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపించారు.

ప్రజాస్వామ్యానికి పరీక్షగా మారిన నామినేషన్లు

ఎన్నికల్లో గెలుపోటములు ప్రజల తీర్పుపై ఆధారపడాలి తప్ప, ప్రత్యర్థులను భయపెట్టడం, నామినేషన్లను అడ్డుకోవడం ద్వారా కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లు, ఘర్షణలు చోటుచేసుకుంటే స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తి దెబ్బతింటుందని, టీడీపీ పాలనలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement