టీడీపీ నేతలపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఫిర్యాదు

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

నగరి : మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయడానికి కశింమిట్ట సచివాలయానికి వెళ్లే సమయంలో టీడీపీకి చెందిన కేజేకుమార్‌, ఆయన కుమారులు విజయ్‌, రాము, సురేష్‌, మురళి, అనుచరులు నామినేషన్‌ పత్రాలు చింపేశారని, కొట్టి చంపుతామని బెదిరించారని 4వ వార్డు అభ్యర్థి తామరసెల్వి వాపోయారు. ఆమె ఆదివారం మాజీ మంత్రి ఆర్కేరోజాతో కలిసి సీఐ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ తన మరిది అయిన మగేశ్వరన్‌ తల పగులగొట్టి హత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): స్థానిక సంస్థల ఎన్నికలు, దసరా పండుగ సందర్భంగా ప్రభు త్వ సెలవు దినం కావడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. సోమవారం నాడు అర్జీలు సమర్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి రావొద్దని స్పష్టం చేశారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజా సమస్యల పరిష్కా రం కోసం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని రద్దు చేసిన ట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో స్థానిక సంస్థల (మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్‌) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్‌ కోడ్‌) అమలులో ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుండడంతో ఈ నెల 19న పీజీఆర్‌ఎస్‌ రద్దు చేశామన్నారు. జిల్లాలో డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలింగా రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్‌కు రావొద్దని కలెక్టర్‌ సూచించారు.

మున్సిపల్‌ పోలింగ్‌ రోజున స్థానిక సెలవు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌, ఇతర మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న ఎన్నికల దృష్ట్యా ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటించేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 28న స్థానిక సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు ఉంటుందన్నారు. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ 1988 మేరకు అక్టోబర్‌ 28న కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడే ఇవ్వాలని లేబర్‌ ఆదేశించారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలుగా ఉపయోగిస్తున్న పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలకు పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించాలని తెలిపారు.

నేడు జెడ్పీ ఎన్నికల నోటిఫికేషన్‌

చిత్తూరు కార్పొరేషన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్‌ స్వీకరణ, 23 నామినేషన్‌ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉపసంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌, 4 అవసరమైన చోట రీ పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు, 11న జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీల పరోక్ష ఎన్నికలు ఉంటాయి. జిల్లాలోని 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు రిజర్వేషన్‌ ప్రకటించారు.

నామినేషన్‌ పత్రాలు

చింపివేతపై కేసు నమోదు

పుత్తూరు: వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డి.జయప్రకాష్‌ నామినేషన్‌ పత్రాలను చింపివేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జయప్రకాష్‌ నామినేషన్‌ పత్రాలతో మున్సిపల్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రం వద్దకు వెళుతున్నాడు. వడమాలపేట మండలం ఎల్‌ఎం కండ్రిగకు చెందిన ఉదయ్‌, వడమాలపేట మాజీ జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి అక్కడు ఉన్నారు. ఈ క్రమంలో ఉదయ్‌ నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపివేసి పరారయ్యాడు. జయప్రకాష్‌ ఫిర్యాదు మేరకు ఉదయ్‌, మురళీధర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement