ఎన్నికల పరిశీలనకు ప్రత్యేక బృందాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

● జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు విధులు, బాధ్యతలను ఖరారు చేశారు. జిల్లాల వ్యాప్తంగా పరిశీలకులు, నిఘా బృందాలను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరించనుండగా, ఆయన నేతృత్వంలో ఎన్నికల కోడ్‌, నియమావళి అమలయ్యేలా ప్రత్యేక నిఘా బృందాలు పర్యవేక్షిస్తాయి.

అధికారుల హోదాలు, విధులు

జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అలాగే వార్డుల రిజర్వేషన్లు, నోడల్‌ అధికారుల నియామకం, ప్రవర్తనా నియమావళి అమలు కమిటీల ఏర్పాటు చేస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సహాయ ఎన్నికల అధికారులుగా మున్సిపల్‌ కమిషనర్లు వ్యవహరిస్తారు. వీరు ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిగా ఓటర్ల గణన, పోలింగ్‌ కేంద్రా ల ఎంపిక, నామినేషన్ల స్వీకరణ బాధ్యతలను చూస్తారు. అలాగే నిర్ధేశిత వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారిని కలెక్టర్‌ నియమిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే బాధ్యత.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తాయి. ఈ బృందంలో ఒక మేజిస్ట్రేట్‌ స్థాయి అధికారి, ఒక పోలీసు అధికారి, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు. వీరు నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటారు.

స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందం :

వీరు మున్సిపాలిటీ పరిధిలోని సరిహద్దులు, చెక్‌ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక బృందం (పెద్ద మున్సిపాలిటీల్లో రెండు, కార్పొరేషన్లలో అంత కంటే ఎక్కువ) ఉంటుంది.

వీడియో సర్వేలెన్స్‌ బృందం :

ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. కోడ్‌ ఉల్లంఘనలు జరిగితే సాక్ష్యంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయి.

వ్యయ పరిశీలకులు

అభ్యర్థులు చేసే ఖర్చును పర్యవేక్షిస్తుంటారు. అభ్య ర్థులు సమర్పించే లెక్కలను వీడియోల ఆధారంగా పరిశీలిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement