దుర్గమ్మకు క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు క్షీరాభిషేకం

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

వి.కోట: దుర్గాష్టామి సందర్భంగా పట్టణంలోని శ్రీ దుర్గామాతకు ఆదివారం 3,550 కలశాలలోని పాలతో అభిషేకం చేశారు. మహిళలు వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సారె, పాల కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పాలతో దుర్గామాతకు అభిషేకం చేశారు. సీఐ సోమశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఆలయ ప్రాంగణంలో కళాకారులు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు బహుమతులు అందించారు. అలాగే కవి, రచయిత రఘుపతి రాసిన దుర్గమ్మ చరిత్ర పుస్తకాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించి భక్తులకు పంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement