మేయర్‌ అభ్యర్థిగా చంద్రశేఖర్‌ నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ అభ్యర్థిగా చంద్రశేఖర్‌ నామినేషన్‌

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా ఆర్‌.చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. శనివారం ఈ మేరకు వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డితో కలిసి చంద్రశేఖర్‌ దంపతులు నామినేషన్‌ను ఎన్నికల అధికారికి సమర్పించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయాల ప్రకారం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ్‌ ఆమోదంతో మేయర్‌ అభ్యర్థిని ఎంపిక చేశామన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వన్నికుల క్షత్రియ నేత, విద్యావంతుడు, న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌ని బరిలోకి దింపుతున్నామని వెల్లడించారు.

ప్రజా సంక్షేమానికి కృషి

అనంతరం మేయర్‌ అభ్యర్థి ఆర్‌.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గతంలో డిప్యూటీ మేయర్‌గా పనిచేసి ప్రజలకు సేవలు అందించానన్నారు. ఇప్పుడు మేయర్‌గా గెలిపిస్తే నగరాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement