నామినేషన్‌కు నేడే ఆఖరు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌కు నేడే ఆఖరు

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

● నగరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి కూటమి అభ్యర్థి ని ప్రకటించారు., వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇక్కడున్న 40 వార్డులకు 112 నామినేషన్లు అందాయి. కూటమి పొత్తుల్లో భాగంగా ఎవరికెన్ని వార్డులు కేటాయించాలనేదానిపై ఒకరికొకరు పట్టు వీడడంలేదు. అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే రెబల్స్‌గా పోటీ చేస్తామని చెప్పిన కూటమి నేతలు, మూడు వార్డులకు నామినేషన్లు కూడా వేశారు. ● కుప్పం మున్సిపాలిటీలో 32 వార్డులకు గానూ మొత్తం 128 నామినేషన్లు అందాయి. వైఎస్సార్‌సీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థి కోసం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థిని ప్రకటించేశారు. నాలుగు చోట్ల కూటమి రెబల్‌ అభ్యర్థులు కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు వేశారు. ● పలమనేరులో 36 వార్డులకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాయి. కూటమి నుంచి ఏడుగురు రెబల్స్‌ కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు అందచేశారు.

చిత్తూరు మేయర్‌గా చంద్రశేఖర్‌– హేమలత మధ్యే పోటీ

పలమనేరు, కుప్పం, నగరి స్థానాలపై ఉత్కంఠ

కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులపై పార్టీల మౌనం

సాక్షి, చిత్తూరు: పురపోరులో నిలబడి గెలవాలంటే ముందుగా నామినేషన్‌ దాఖలు చేయాలి. దీనికి ఆదివారంతో గడువు ముగుస్తుంది. ఇక మిగిలింది గంటల వ్యవధి మాత్రమే. రెండు రోజులుగా మున్సిపాటీల్లోని 168 వార్డులకు 233 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలకు 24 నామినేషన్లు అందాయి. ఇక చిత్తూరు మేయర్‌ స్థానం తప్ప.. మిగిలిన మూడు పురపాలక సంఘాల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా తలపడేది ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

చిత్తూరులో పోటీ ఇద్దరి మధ్యే..

చిత్తూరు మేయర్‌ స్థానంపై స్పష్టత వచ్చేసింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ నడుస్తోంది. అధికారపార్టీ కటారి హేమలత పేరును ఖరారు చేస్తే, వైఎస్సార్‌సీపీ వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఆర్‌.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. అయితే టీడీపీకి రెబల్స్‌ గండం పొంచి ఉంది. న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ యాదవ్‌ (టీడీపీ), మాజీ కార్పొరేటర్‌ శశినాయకర్‌ (స్వతంత్ర అభ్యర్థి) నామినేషన్లు దాఖలు చేశారు.

పరిశీలన తర్వాతే బీఫారమ్‌

నామినేషన్ల దాఖలకు ఆదివారంతో గడువు ముగియడం, సోమవారం పరిశీలన, అదే రోజు ఎవరెవరు మిగిలారనే వివరాలు ప్రకటిస్తారు. ఆపై నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆపై వార్డు కౌన్సిల ర్లు, కార్పొరేటర్లకు బీఫారాలు ఇవ్వాలని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. ముందుగా అభ్యర్థుల పేరిట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు బీఫారాలు ఇస్తే, అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగే అవకాశం ఉండడంతో పార్టీలు ఈ మేరకు జాగ్రత్త పడుతున్నాయి.

మున్సిపోల్స్‌ నామినేషన్లు ఇలా..

మున్సిపాలిటీ వార్డులు వైఎస్సార్‌సీపీ కూటమి మేయర్‌/

ఛైర్‌పర్సన్‌

చిత్తూరు 60 78 69 8

నగరి 40 57 44 7

పలమనేరు 36 19 39 2

కుప్పం 32 53 54 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement