ప్రజాధనం దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దుర్వినియోగం

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

ప్రచారానికి ప్రజా ధనం

చిత్తూరు కలెక్టరేట్‌ : సీఎం చంద్రబాబు తన ప్రచారానికి ప్రజా ధనాన్నియథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని మాజీ వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తాము ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందిస్తుంటే తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబడుతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన తమకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తేనే ప్రజాధనం వృథా చేస్తున్నారని గగ్గోలు పెట్టారని, ఇప్పుడేమో ప్రజాధనాన్ని ఇలా ప్రచారానికి వాడుకోవడం ఎక్కడి న్యాయమని మండిపడుతున్నారు.

నీతి, మతిలేని చర్య

ప్రజలకు విశేష సేవలు అందించిన వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల పొట్టకొట్టారు. లక్షలాది మందిని వీధుల పాలు చేశారు. ఇంటి ముంగిటే అందుతున్న సేవను సైతం దూరం చేశారు. నేడు కంటెంట్‌ క్రియేటర్ల పేరుతో ప్రభుత్వం ప్రచారం కోసం ప్రజాధనాన్ని దోచి పెట్టడం నీతి, మతి లేని చర్య. – జాకీర్‌, మాజీ వలంటీర్‌, చిత్తూరు

కరోనా సమయంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సేవలు అందించారు. వేకువజామునే గడపగడపకూ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచింది. రూ.5 వేల గౌరవ వేతనంతోనే ప్రజాధనం దుర్వినియోగమైందని విమర్శించిన ఈ పాలకులు ఇప్పుడు సొంత డబ్బా కొట్టుకునేందుకు రూ.లక్షలు చెల్లిస్తామని జీవో విడుదల చేశారు. ఇది కాదా దుర్వినియోగం. – సుస్మిత్‌, మాజీ వలంటీర్‌, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement