బడి ఎన్నికలు ఏకపక్షం! | - | Sakshi
Sakshi News home page

బడి ఎన్నికలు ఏకపక్షం!

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

● చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట జెడ్పీ హైస్కూల్‌లో టీడీపీ నేతల జోక్యం ● తల్లిదండ్రుల ఆగ్రహం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత, వివాదాల నడుమ ఏకపక్షంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతల జోక్యం మితిమీరడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మంగళవారం జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా మండల విద్యాశాఖ అధికారులు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకే బీఎన్‌ఆర్‌పేట పాఠశాల ప్రాంగణాన్ని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ముట్టడించాయి. ఎన్నికలను ఏకపక్షంగా తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నాయకులు వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కొందరు నేతలు పాఠశాల హెచ్‌ఎం గదిలోనే కాపు కాయడం, మరికొందరు ప్రాంగణమంతా మోహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక ఉపాధ్యాయుడిపై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.

చేయి ఎత్తకున్నా లెక్కల్లోకి..

ఓటింగ్‌ సమయంలో ఉపాధ్యాయులు సైతం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభలో కొందరు సభ్యులు చేయి ఎత్తకపోయినప్పటికీ, వారు కూడా మద్దతు తెలిపినట్లే లెక్కలు రాసేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఎన్నికల రగడతో పాఠశాల వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్తగా 10 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement