నగరి: స్థానిక డిగ్రీ కళాశాల కేవీకే స్టేడియంలో గురువారం 70వ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి అండర్–17, అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికై న క్రీడాకారులకు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు ఎస్‌ఎం.లోకనాథం, త్రిలోకసుందరి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 10వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంఈవో 2 నమశ్శివాయం, పీసీఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెక్స్, అధ్యాపకులు వాసు, జిల్లా సెపక్తాకర కార్యదర్శి శరత్, మాజీ ఎస్‌జీఎఫ్ కార్యదర్శి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు మణి, ప్రకాష్ తదితరులు క్రీడాకారులను అభినందించారు.


