ప్రజల సొమ్ముతో పచ్చ భజన! | - | Sakshi
Sakshi News home page

ప్రజల సొమ్ముతో పచ్చ భజన!

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

●

సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. కూటమి ప్రచారానికి డప్పు కొట్టండి డబ్బులిస్తామంటూ ప్రకటించడంపై నిరుద్యోగ యువతలో ఆగ్రహం వెల్లుబుకుతోంది. వైఎస్సార్‌ సీపీ పాలనలో రాత్రింబవళ్లు కష్టపడిన సచివాలయ వలంటీర్లకు రూ.5 వేలు గౌరవ భృతి ఇస్తేనే ప్రజాధనం వృథా చేస్తున్నారని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో ప్రజాధనాన్ని ఇలా ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రజలు మండిపడుతున్నారు. ఎవడబ్బ సొమ్మని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలకు లక్షలు ఇస్తామంటున్నారని పెదవి విరుస్తున్నారు. – చిత్తూరు కలెక్టరేట్‌

మహిళలకు ఎగనామం

ఎన్నికల్లో మహిళలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ వరాల జల్లు కురిపించారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఆడబిడ్డ నిధి జాడ లేదు. ఒక పక్క అన్ని ఖర్చులూ పెరిగిపోతోంది. మహిళలకు ఇచ్చేందుకు లేని నిధులు ఇన్‌ఫ్లుయన్సర్స్‌ పాలసీ అని డప్పు కొట్టే బ్యాచ్‌కు ఇస్తామంటున్నారు. ఇదేనా మహిళలకు మంచి చేసే పాలన. ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు ఇస్తే ఆర్ధిక భారం పడదా? ఆదాయం సృష్టించడమంటే ఇదేనా?

– కె.కవిత, దిగువ కావేటిపురం, నగరి మండలం

ఉపాధి

అవకాశాలు ఏవి?

ఏటా జాబ్‌ క్యాలెండర్‌, ఇతర శాఖల్లో

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే మార్గం చూపకుండా, పార్టీ కోసం డప్పు కొడితే డబ్బులు ఇస్తామనడం నిరుద్యోగులను గేలి చేయడమే. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని సోషల్‌ మీడియాలో డప్పు కొట్టేవారికి తగలేస్తున్నారు? సొంత పార్టీ ప్రచారానికి ప్రభుత్వ ఖజానాను వాడుకోవడం దుర్మార్గం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టకుండా, యువతను ప్రచార కార్యకర్తలుగా మార్చాలని చూడటం సరికాదు. – రంజిత్‌, నిరుద్యోగి

వలంటీర్లను

నడిరోడ్డుపై నిలబెట్టారు

‘గతంలో మేము కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రామీణ స్థాయిలో సేవలు అందించాం. నాడు మాకు ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనాన్ని ప్రజాధనం వృథా అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మమ్మల్ని నడిరోడ్డులోకి తోసేశారు. ప్రజలకు సేవ చేసిన మాకు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, పార్టీ ప్రచారం చేసుకునే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ధారాదత్తం చేయడానికి డబ్బులు ఉన్నాయా? ఇది ప్రజలను, సేవా దృక్ఫథాన్ని దారుణంగా అవమానించడమే.

– అబ్దుల్లా, మాజీ వలంటీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement