16 మంది మందుబాబుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

16 మంది మందుబాబుల అరెస్టు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

శాంతిపురం: మండలంలోని రాళ్లబూదుగూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 16 మందిని అరెస్టు చేసి కుప్పం అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరు పరిచినట్టు ఎస్‌ఐ ఐ.నరేష్‌ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్‌ కెమెరాల సాయంతో గుర్తించి పట్టుకున్నామని పేర్కొన్నారు. న్యాయస్థానం వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టపగలే చోరీ

పలమనేరు: పలమనేరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. మదనపల్లి రోడ్డులో జనసందోహం ఎక్కువగా ఉండే కోటక్‌ మహేంద్ర బ్యాంకు ముందు ఆపిన పాలక్యాన్ల ద్విచక్రవాహనం బుధవారం చోరీకి గురైంది. బాధితుడు తన వాహనం కనిపించలేదని లబోదిబోమంటుండగా అక్కడి సీసీ కెమెరాను కొందరు పరిశీలించారు. భిక్షాటన చేసుకునే వేషంలో ఉన్న వ్యక్తి ఏమాత్రం అనుమానం రాకుండా ఆ బండిని చోరీ చేసి నడుపుకుంటూ వెళ్లడం కనిపించింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒంటైపె సవారి

యాదమరి: మండల కేంద్రమైన యాదమరిలో బుధవారం ఒక ఒంటె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా రాజస్థాన్‌ వంటి ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఒంటెను యాదమరిలోకి తీసుకువచ్చారు. దీన్ని చూసేందుకు స్థానికులు, చిన్న పిల్లలు ఉత్సాహం చూపారు. చాలా మంది ఒంటెతో కలసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కొంతమంది తల్లిదండ్రులు నిర్వాహకులకు నిర్ణీత రుసుము చెల్లించి తమ చిన్నారులను ఒంటైపె కూర్చోబెట్టి సవారి చేయించి మురిసిపోయారు. ఒంటైపె స్వయంగా తాము సవారి చేయడంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపంజాణి: మండలంలోని పుంగనూరు–బైరెడ్డిపల్లి మార్గంలోని కత్తార్లపల్లి క్రాస్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పెద్దపంజాణి హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌ నాయక్‌ కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ తాలూకా భద్రావతికి చెందిన గంగప్ప కుమారుడు బి.సుందర్‌(44) ప్రస్తుతం వాయల్పాడు మండలం నగిరిమడుగు పంచాయతీ పాతకోటపల్లిలో కాపురం ఉంటున్నాడు. మంగళవారం పెద్దపంజాణి మండలంలోని చిన్నవెలగటూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. పనులు చూసుకుని తిరిగి బయలుదేరాడు. మార్గమధ్యంలోని కత్తార్లపల్లి క్రాస్‌ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కిడికక్కడే మృతి చెందాడు. స్థాని కుల సమాచారంతో హెచ్‌సీ శంకర్‌ నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మురకంబట్టులో

గంజాయి స్వాధీనం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగర పరిధిలోని మురకంబట్టు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి దందాను బుధవారం తాలూకా పోలీసులు గుట్టురట్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు టౌన్‌ తోటపాళ్యానికి చెందిన వై.జయకుమార్‌ (27), సత్తువాచారికి చెందిన మహమ్మద్‌ ఆలీ (27) కూలి పనులు చేస్తూ గంజాయి అక్రమ రవాణాకు అలవాటు పడ్డారు. పూతలపట్టు మండలం బండపల్లి నుంచి 600 గ్రాముల గంజాయి తీసుకొస్తుండగా ముందుగా అందిన పక్కా సమాచారంతో తాలూకా ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్టు చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement