కలెక్టరేట్‌ ఎదుట కన్నీటి నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట కన్నీటి నిరసన

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

– 8లో

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కోటేశ్వరి అనే మహిళ పింఛన్‌ మంజూరు కోసం నిరసన చేపట్టింది.

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. న్యాయమైన డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంచుతున్నాం. వాటికి పరిష్కారం చూపకుండా రెండేళ్లుగా కాలయాపన చేశారు. దీనిపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ఎవరికై నా హక్కు ఉంది. ఒక్క డిమాండ్‌కు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా సమస్యలకు పరిష్కారం లభించేవరకు పోరాటాలు చేయకతప్పదు.

–విద్యాసాగర్‌, స్వర్ణ వార్డు ఉద్యోగి, తిరుపతి

సమస్యలు పట్టించుకోండి

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సమస్యలను కాస్తా పట్టించుకోండి. రెండేళ్లుగా ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడంతోనే చలో విజయవాడ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. హక్కుల కోసం నిరసన చేపట్టడం నేరమా..?. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. దాంతోనే పనిభారం తీవ్రంగా మారింది. వలంటీర్లు ఇచ్చే పింఛన్ల పనులు మేమే చేస్తున్నాం. మాపైన ప్రభుత్వానికి కనికరం లేకుండా కేసులు పెట్టడం ఏ మాత్రం సరికాదు.

–మునితేజ, స్వర్ణ వార్డు ఉద్యోగి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement