వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

– 41 నోటీసు ఇచ్చి పంపి..

మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి..

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల చిత్తూరు మండలంలోని నాయనిచెరువు, నగరంలోని దొడ్డిపల్లె ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్‌ గుట్టును వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను బీసీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ మండల నేత త్యాగరాజులు సైతం తనదైన శైలిలో గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు కుట్రపూరితంగా కేసు నమోదు చేయించేందుకు తెగబడ్డారు. పాత వీడియోలను తెరపైకి తెచ్చి, అక్రమంగా మద్యం పెట్టించి కేసు నమోదు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు..

పోలీసులు వైఎస్సార్‌సీపీ మండల నేత త్యాగరాజులకు మధ్యాహ్నం. 3.30 గంటలకు 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంరారు. మళ్లీ రాత్రి 8 గంటల ఫోన్‌చేసి పోలీస్‌ స్టేషన్‌కు రమ్మన్నారు. 24 గంటల స్టేషన్‌లోనే ఉండాలని ఆదేశించారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గే పోలీసులు మళ్లీ పిలిపించి స్టేషన్‌లో ఉంచారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.

బంగారు కుటుంబానికి అవార్డు

కుప్పం : కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 బంగారు కుటుంబం కార్యక్రమానికి జాతీయ స్థాయిలోని గుర్తింపు లభించింది. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా)ను స్కోచ్‌ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్‌ సమ్మిట్‌ లో కడా పీడీ వికాస్‌ మర్మత్‌, పీకేఎం యుడా చైర్మన్‌ సురేష్‌ అవార్డులను అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement