– 8లో
– 8లో
రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లో చిత్తూరు చిరునామా జాబ్ కార్డ్ మాత్రం గుడిపాలలో
సేలంకొండ ప్రాంతంలో జూదం దందాను డ్రోన్ కెమెరాతో గుర్తించి జూదరులను పోలీసులు అరెస్టు చేశారు.
వెలుగులోకి
ఉపాధి అక్రమాలు
గుడిపాల: తవ్వే కొద్దీ ఉపాధిలో అవినీతి బాగోతం గుడిపాల మండలంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ భారీగా అక్రమాలకు పాల్పడి బిల్లులు కాజేశారన్న విషయం పాఠకులకు తెలిసింది. తాజాగా ఆమె భర్తపై ఉపాధిహామీ పనులు చేసినట్లు వేలల్లో డబ్బులు దోచేశారు. అతనికి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అంతా చిత్తూరులో ఉండగా జాబ్ కార్డ్ మాత్రం గుడిపాల మండలంలో పుట్టించారు. అది కూడా అతని ఒక్కరే ఉన్నట్లు జాబ్ కార్డ్ సృష్టించి వేల రూపాయల్లో ఉపాధి పనులు చేసినట్లు డబ్బులు కాజేశారు. దీంతో ఈ ఉదంతం బయటపడింది.
బీసీని ఎస్సీ చేసేశారు
గట్రాళ్ళమిట్ట పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ భర్త జిల్లా వడ్డెర సంఘం యువత అధ్యక్షుడు, గుడిపాల మండల వడ్డెర సంఘ యువత అధ్యక్షుడుగా ఉన్న అతన్ని జాబ్‌కార్డ్‌లో ఏకంగా ఎస్సీని చేశేశారు. ఇతను బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసినా ఎస్సీ కులంగా మార్చారు. ఇతని కుటుంబం అంతా చిత్తూరులోనే ఉన్నా రు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు పెళ్లయి సుమారు 15 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రం వాళ్ల అమ్మ కుటుంబసభ్యుల జాబ్ కార్డ్‌నే ఉంది. ఆమె భర్తను మాత్రం ఎటువంటి ఫ్రూఫ్‌లు లేకుండానే ఒక్కరికే జాబ్‌కార్డ్ మంజూరుచేయించి పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ భర్తపై ఉపాధిహామీ బిల్లులు
ఉపాధి కూలీల ఫిర్యాదు
తాము పనులు చేసినా తమకు బిల్లులు తక్కువ పడడంతో గట్రాళ్లమిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే ఉపాధి కూలీ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశాడు. తాము ఉపాధిలో పనులు చేస్తుంటే వారానికి రూ.800 మాత్రమే వస్తుండడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయట పడింది. కొంతమంది కూలీలు పనులు చేయకనే వారిపై ఫీల్డ్ అసిస్టెంట్ బిల్లులు పెట్టుకోవడంతో పనులు చేస్తున్న అసలైన కూలీలకు డబ్బులు తక్కువ రావడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగానే ఫీల్డ్ అసిస్టెంట్ భర్తపై కూడా పనులు చేయకనే బిల్లులు పెట్టుకున్నట్టు తెలిసింది. కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఉపాధిహామీ అధికారులు గట్రాళ్లమిట్ట గ్రామంలో పర్యటించి కూలీలను విచారించారు. ఇందులో పలు విషయాలు బయటపడ్డాయి.


