చిత్తూరు రూరల్ (కాణిపాకం): న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించేందుకు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. తొలుత వారు ర్యాలీ నిర్వహించారు. విధుల నిర్వహణలో న్యాయవాదులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ, రక్షణ చట్టం ఆవశ్యకతపై నేతృత్వంలో వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలని, విధులు నిర్వహిస్తున్న లాయర్లపై దాడులకు పాల్పడే వారిపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పి.అశోక్ ఆనంద్ యాదవ్, భూప్రసన్న, చిన్నబ్బ, షఫీల్లా, జయకుమార్, సి.వి. రెడ్డి, అక్బర్ బాషా, విజయసింహారెడ్డి, చక్రవర్తి రెడ్డి, భయ్యామేరీ, రవికుమార్, సునీల్ కుమార్, అంజాద్ బాషా, వి.లోకనాథ రెడ్డి, మహిళా న్యాయవాదులు గోమతి, స్వరూప లక్ష్మి, సరస్వతి, నళిని సహా బార్ అసోసియేషన్ సభ్యులు, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


