పకడ్బందీగా స్లాస్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 182 పాఠశాలల్లో స్లాస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో స్లాస్ పరీక్షలు నిర్వహించారు. డీఈవో విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్లాస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పెనుమూరు జెడ్పీ హైస్కూల్, గుడ్యానంపల్లి జెడ్పీ, చిత్తూరు రూరల్ అగ్రహారం పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినట్లు చెప్పారు. పరీక్షలు పూర్తయిన వెంటనే సంబంధిత జవాబుపత్రాలను పకడ్బందీగా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించిన జీడీ నెల్లూరు మండలంలోని ఓ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈవో వెల్లడించారు.
స్లాస్ పరీక్షలకు
9,077 మంది హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన స్లాస్ పరీక్షలకు 9,077 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 187 పాఠశాలల్లో నిర్వహించారు. ఐదో తరగతి విద్యార్థులు 2,755 మంది, ఏడో తరగతి విద్యార్థులు 3,175 మంది, తొమ్మిదో తరగతి విద్యార్థులు 3,147 మంది మొత్తం 9,077 మంది పరీక్షలు రాశారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 6,643 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,096 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.
ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఐటీఐ కళాశాల ల్లో నాలుగో విడత అడ్మిషన్లుఅవకాశం కల్పించారని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) 4వ విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31 వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నా రు. www. itaadmissions.ap.gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 31 న మధ్యాహ్నం 2 గంటలకు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 6302634177, 9440738121, 9182590869 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


