చిత్తూరు కలెక్టరేట్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15వ తేదీన వినూత్నంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తు లు, సంస్థలను సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైద్యం, విద్య, వ్యవసాయం, కళలు, సేవా రంగం, వ్యాపారం, సృజనాత్మకత, విద్యుత్, స్వచ్ఛత– పరిశుభ్రత, క్రీడలు తదితర 10 విభాగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఎంపిక చేయాలని సూచించారు. ప్రతిపాదనల జాబితాను త్వరితగతి ని అందించాలని కోరారు.
ఏనుగుల స్వైర విహారం
గుడిపాల : చైన్నె – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ఏనుగులు స్వైరవిహారం చేశాయి. సమీపలోని భద్రకాళమ్మ ఆలయంలో అమ్మవారి ఊంజల్ సేవ నిర్వహించే ఉయ్యాల రాడ్లను విరగొట్టాయి. గుడి పక్కన జింక్ షీట్లను ధ్వంసం చేశాయి.
డేటానే కీలకం
కుప్పం : వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర– 2047 సాధనకు డేటానే కీలమని పీ4, పెహలే ఇండియా శిక్షణ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం కడా కార్యాలయ ప్రాంగణంలో అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. వారు మాటాల్డుతూ, నాణ్యమైన డేటా, కచ్చితమైనా విశ్లేషణ, సమర్థవంతమైనా అమలు ద్వారా అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని వెల్లడించారు.


