పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌కు నిధులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌కు నిధులు విడుదల

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఈ నెల 24వ తేదీ నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌– టీచర్స్‌ మీటింగ్‌కు నిధులు విడుదల చేశారు. బుధవారం ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ ఎస్పీడీ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 2,116 ప్రభుత్వ పాఠశాలలకు గాను రూ.41.95 లక్షల బడ్జెట్‌ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకు నిధులు ఖర్చు చేయాలని సూచించారు.

25న జెడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు బుధవారం తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వ్యవసాయం, ఉద్యానవన, విద్యా, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, జిల్లా గ్రామీణభివృద్ధి, డ్వామా, సీ్త్ర శిశు సంక్షేమ అంశాలపై చర్చ ఉంటుందని, అధికారులు పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆదేశించారు.

ఐఎస్‌ఐ గుర్తింపు గర్వకారణం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని కార్వేటినగరం గ్రామ పంచాయతీకి ఐఎస్‌ఐ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌ లభించడం గర్వకారణమని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐఎస్‌ఐ గుర్తింపు సర్టిఫికెట్‌ను డీపీఓ సుధాకర్‌కు కలెక్టర్‌ అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాలనలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, పౌరసేవల సమర్థవంతమైన నిర్వహణలో కార్వేటినగరం పంచాయతీ ఉత్తమంగా నిలిచిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన తొలి పంచాయతీగా కార్వేటినగరం కీర్తిపొందిందని వివరించారు. డీపీఓ సుధాకర్‌ మాట్లాడుతూ కార్వేటినగరం ప్రజలందరికీ ఈ ఘనత చెందుతుందన్నారు. పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారుల నిరంతర శ్రమ, అంకితభావం, సమష్టి కృషికి లభించిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో రెండో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు జిల్లా కన్వీనర్‌ రవీంద్రరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల విద్యార్థులు అందుబాటులోని ఐటీఐ కోర్సులకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం నుంచి ఆగస్ట్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అనంతరం అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఐటీఐ కళాశాలకు నేరుగా వెళ్లి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు 6 నుంచి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని వివరించారు. ఈ క్రమంలోనే www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 6302634177, 9440738121, 9182590869 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement