చిత్తూరు కలెక్టరేట్ : స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్–2047 లక్ష్య సాధనకే సామర్థ్యాల పెంపునకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ లకా్‌ష్య్‌ల సాధన, డేటా ఆధారిత ప్రణాళికలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. పహల్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా వివిధ స్థాయిల అధికారులకు సామర్థ్య పెంపు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందుబాటులోని వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా అధికారులను సిద్ధం చేయడానికే ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శివ్‌నాడార్ వర్సిటీ ప్రొఫెసర్ పుష్ప త్రివేది, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ అసిస్టెంట్ ఫ్రొపెసర్ మనీష్ శర్మ, సీపీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


