ఐరాల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్)లో ఓట్లు గల్లంతు కాకుండా వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలు ఐదు రోజులు క్షేత్రస్థాయిలో అత్యంత కీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన గురువారం కాణిపాకంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్ నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్‌ఏల పనితీరు, డిజిటలైజేషన్ వివరాలను భూమనకు తెలియజేశారు. భూమన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పూర్తయ్యేవరకు బీఎల్‌ఏలు ఓటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. సర్‌ను సాకుగా చూపి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాలకు బీఎల్‌ఓలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు వారి వెంట ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పార్టీ బీఎల్‌ఏలు ఎన్యూమరేషన్ ఫారం పూరించడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేసే వరకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐరాల, తవణంపల్లె మండలాల కన్వీనర్లు చంద్రశేఖర్‌రెడ్డి, హరిరెడ్డి, మాజీ సర్పంచ్ శాంతిసాగర్‌రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి, మండల బూత్ అధ్యక్షుడు హరీష్‌రెడ్డి, చిన్నారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, సుధీర్, భరత్, వివేక్, సాయి, నాగరాజు, గిరి, ఎంపీటీసీ బాబు, బీఎల్‌ఏలు మూర్తి, సౌందర్‌రాజన్, తేజరెడ్డి, చంద్రరెడ్డి, నిరంజన్‌రెడ్డి, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


