పీఎంఏజీవై పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

పీఎంఏజీవై పనులు వేగవంతం

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పీఎంఏజీవై) పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఆయన గురువారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీఎంఏజీవైలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. మంజూరైన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేగం పెంచాలన్నారు. నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించుకోవాలని తెలిపారు.

12 వరకు ర్యాంపుల

గడువు పొడిగింపు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కలెక్టర్‌ ఆదేశాల మేరకు బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల మండలాల్లో ఉన్న ర్యాంపుల గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్‌తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. సదరు మండలాల్లో ఇంకా 30 శాతం మేర పంట మిగిలి ఉండటంతో రైతుల సౌకర్యార్థం మరో రెండు రోజులు ర్యాంపుల కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మురళీకృష్ణ

చిత్తూరు కార్పొరేషన్‌ : చిత్తూరు, తిరుపతి జిల్లా ల ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఏవీ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించా రు. గతంలో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రామకృష్ణారెడ్డి గతనెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. నూతన డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడు తూ కార్మిక సంక్షేమమే ధ్యేయమన్నారు. తమ కార్యాలయం పారిశ్రామిక రంగంలో వృత్తి భద్రత, ఆరోగ్యం, పరిస్థితుల కోడ్‌ ప్రకారం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చట్టబద్ధ నిబంధనల అమలు, కార్మికుల సంక్షేమ పరిరక్షణ, ఫ్యాక్టరీల్లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన పారిశ్రామిక వాతావరణాన్ని ప్రోత్స హించేందుకు తమ శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement