చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ ముక్తర్ అహమ్మద్ తెలిపారు. వారు గురువారం చిత్తూరులోని ఎన్జీవో కార్యాలయంలో ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందన్నారు. ఈ క్రమంలో 14న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు 2024 లోనే 12వ పీఆర్‌సీని అమలు చేస్తామని, ఆలస్యమైతే ఐఆర్ ప్రకటిస్తా మని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డీఏలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ కమిషన్‌ను కూడా నియమించకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తా రు. సుమారు రూ.20 వేల కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 30 శాతం ఐఆర్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి, జీవీ రమణ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 కంటే ముందు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలన్నా రు. లేదా ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ మాన్యువల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబో యే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మదన్‌మోహన్‌రెడ్డి, జగ దీష్, చిట్టిబాబు, చలపతి, ఎస్పీ బాషా, పార్థసారథి, మోహన్, ధనుంజయులు, ఢిల్లీ ప్రకాష్ పాల్గొన్నారు.


