శాస్త్రవేత్తల దృష్టికి మామిడి రైతుల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తల దృష్టికి మామిడి రైతుల సమస్యలు

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

వడమాలపేట (పుత్తూరు): ఏటా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి రైతులు తమ సమస్యలను ఐకేర్‌ ఎక్స్‌ఫర్ట్‌ టీమ్‌ (ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తల ముందు ఏకరవు పెట్టారు. శాస్త్రవేత్తల బృందం గురువారం వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా మామిడి రైతులతో చర్చించా రు. ఎస్బీఆర్‌పురం, కేబీఆర్‌పురం నుంచి వచ్చిన రైతు లు మాట్లాడుతూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశించిన మేరకు గుజ్జు పరిశ్రమలు తోతాపురం కేజీకి రూ.8 వంతున చెల్లించలేదని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే గిట్టుబాటు ధర ఉండడం లేదని వాపోయారు. అడిషినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హా ర్టికల్చర్‌ హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కా రం చూపుతామని తెలిపారు. రైతులు పంట నాణ్యత ను పెంచుకోవాలని, గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) గ్రేడింగ్‌ పద్ధతి, ప్రూట్‌ కేర్‌ ఆక్టివిటీ (ఫ్రూట్‌ కవర్‌) చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేర్‌ టీమ్‌ సభ్యులు దామోదరన్‌, శంకరం, సింగ్‌, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ దేవమునిరెడ్డి, జిల్లా హార్టికల్చర్‌ ఆఫీసర్‌ దశరథరామిరెడ్డి, పుత్తూరు డివిజన్‌ ఉద్యానవన అధికారి వెంకట సౌజన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement