రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సుమంత్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సుమంత్‌ విజయం

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌) ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ఎన్‌వీ సుమంత్‌ విజయం సాధించా రు. సుమంత్‌ చిత్తూ రు నగరంలోని తోటపాళ్యం కాగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఓ ట్ల లెక్కింపులో చిత్తూరు, వైఎస్సార్‌ కడప, నెల్లూ రు, తిరుపతి జిల్లాల నుంచి 1409 ఓట్ల కోటాను సాధించిన ఆయన.. బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికైనట్లు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి పద్మలత ప్రకటించారు. చిత్తూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రస్తుత రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి తనయుడే సుమంత్‌ కావడం గమనార్హం. ఆయన గెలుపుపై జిల్లాకు చెందిన పలువురు న్యాయ వాదులు, న్యాయవాద సంఘాలు సైతం అభినందనలు తెలిపారు.

నాణ్యమైన కరెంటు

సరఫరాకు కృషి

పెనుమూరు(కార్వేటినగరం): విద్యుత్‌ విని యోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన విద్యుత్‌ను అందించాలని ఎస్‌ ఈ ఇస్మా యిల్‌ అహ్మద్‌ అన్నారు. మంగళ వారం పెనుమూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను తని ఖీ చేశారు. వేసవి దృష్యా విద్యుత్‌ వినియో గం పెరిగే అవకాశం ఉందని దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని పేర్కొన్నారు. గ్రామాలలో విద్యుత్‌ వినియో గంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాత బకాయిలను వేగవంతంగా వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం సబ్‌స్టేషన్‌ రికార్డులను పరిశీలించి తగు సూచనలిచ్చారు. ఆయన వెంట చిత్తూరు రూరల్‌ ఈఈ సురేష్‌కుమార్‌, పెనుమూరు ఏఈ తులసీ ప్రసాద్‌ ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

వి.కోట : బైక్‌పై వెళ్తున్న వ్యకిని గుర్తుతెలియని లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం వేకువ జామున మండలంలోని నెర్నిపల్లి గ్రామానికి చెందిన అక్బర్‌ సాహెబ్‌(60) పలమనేరు జాతీయ రహదారి దొడ్డిపల్లి క్రాస్‌ సమీపంలో తన బైక్‌పై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని లారీ అక్బర్‌ బైక్‌ను ఢీకొని ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అక్బర్‌ అక్కడికక్క డే మృతి చెందాడు. గమనించిన స్థానికలు పోలీ సులకు ఈ ఘటన పై సమాచారం ఇవ్వగా సీసీ ఫుటేజ్‌ సాయంతో ప్రమాదానికి కారణమైన లారీ ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా కృష్ణానాయక్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా కృష్ణానాయక్‌ను ప్రభు త్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌లకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు నూతనంగా ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా నియమితులైన ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement