టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు , సెకండ్‌ గ్రేడ్‌ టీచర్ల జనరల్‌ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపా రు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ జాబితాను మేనేజ్మెంట్‌ల వారీగా (జిల్లా పరిషత్‌, ప్రభుత్వం, మున్సిపాలిటీలు , కార్పొరేషన్‌) విభజించి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో నమోదు చేశామన్నారు . గతంలో (మార్చి 1న) విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని సవరించిన అనంతరం తుది జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. అలాగే ఎంఈఓ డీవైఈవో మెయిల్స్‌కు పంపినట్లు తెలిపారు. సవరించిన ఈ జాబితాలపై ఇంకా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే, తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పా రు. అభ్యంతరాలను ఈనెల 23వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.

కడా పీడీ ఆకస్మిక తనిఖీ

కుప్పం: నియోజకవర్గంలోని మూడు గురుకుల పాఠశాలలో కడా పీడీ వికాస్‌ మర్మత్‌ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మంగళవారం రామకుప్పం, కడపల్లి, గణేష్‌పురంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల వసతి గృహాల్లో తనిఖీ చేట్టా రు. వసతి గృహాల్లో విద్యార్థులకు వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాలు, హాస్టల్స్‌ తాగునీరు, మురుగు దొడ్లు పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాల భోజనాల నాణ్యత, వంట గదులు పరిశుభ్రత, భోజనాల రుచి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ బదిలీ

చిత్తూరు కలెక్టరేట్‌: ఐవోసీఎల్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ వెంకటశివను నంద్యాల జిల్లా ఆత్మకూ రు ఆర్డీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement