● పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25 ● ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 24 ● విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

● పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25 ● ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 24 ● విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

Mar 15 2026 4:59 AM | Updated on Mar 15 2026 4:59 AM

● పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25 ● ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 24 ● విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

ప్రవేశ పరీక్షలు

సద్వినియోగం చేసుకోండి

తిరుపతి అర్బన్‌: పదో తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌. విశ్వనాథ రెడ్డి వెల్లడించారు. శనివారం వరదరాజనగర్‌లోని విశ్వం పోటీపరీక్షల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో 2026 సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది తర్వాత పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరి సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని తెలిపారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా బిటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశముంటుందని వెల్లడించారు. ఏపీ పాలీసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్‌ 4 వరకు గడువు ఉందని, పరీక్ష ఏప్రిల్‌ 25వ తేదీ ఉంటుందని చెప్పారు. అలాగే ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఉందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 24వ తేదీన ఉంటుందన్నారు. ఏపీఆర్‌జేసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ విద్యను ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 36 ఏళ్లుగా పాలిటెక్నిక్‌ కోచింగ్‌లో విశ్వం ఇన్‌స్టిట్యూట్‌ అద్భుత ఫలితాలు సాధించిందని, ముఖ్యంగా 2025 పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో జిల్లా ప్రథమ ర్యాంక్‌ సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షల్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్‌ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 8688888802, 93999 76999 సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement