అదనపు వసూళ్లు చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అదనపు వసూళ్లు చేస్తే చర్యలు

Mar 15 2026 4:58 AM | Updated on Mar 15 2026 4:58 AM

– సందేహాలకు కంట్రోల్‌ రూం ఏర్పాటు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి శంకరన్‌ తెలిపారు. సాక్షి దినపత్రికలో శనివారం గ్యాస్‌ దందా పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన స్పందించారు. గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు డొమెస్టిక్‌ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. గ్యాస్‌ సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పు డు సమాచారం అందించేందుకు కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహాలు ఉన్న వారు 08572–242734 నంబర్‌కు పని దినాల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో వినియోగదారులకు సరిపడా గ్యాస్‌ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గ్యాస్‌ ఏజెన్సీ వద్ద తహసీల్దార్‌ను సరఫరాపై పర్యవేక్షణ కోసం నియమించిన ట్లు చెప్పారు. ప్రజలు వదంతుల ను నమ్మి వెంటవెంటనే గ్యాస్‌ రీఫిల్లింగ్‌ బుకింగ్‌ చేయవద్దని అధికారులు సూ చించారు. వినియోగదారులు గ్యాస్‌ బిల్లులో పేర్కొన్న ధర మాత్రమే డెలివరీ సిబ్బందికి చెల్లించాలని, అదనపు రుసుం డిమాండ్‌ చేసినట్లయితే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై అలాగే డొమెస్టిక్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement