చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల కొరత లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం పంచాయతీల వికేంద్రీకరణకు సిద్ధమైంది. ఆదా యం జనాభాను బట్టి జిల్లాలో పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలును సైతం విడుదల చేశారు. అయితే కార్యదర్శుల కొరత తీరుస్తామంటున్న ప్రభుత్వం ఇటు కొత్త ఉద్యోగుల కల్పన చేయడం లేదు. అటు పంచాయతీల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడం లేదు. ఇదే సమయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థపై నిత్యం విషం చిమ్ముతూనే కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీ కార్యదర్శులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది.
సచివాలయ వ్యవస్థతోనే ముందుకు
జిల్లాలో మొత్తం 621 పంచాయతీలు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకూ మూడు, నాలుగు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ఓ కార్యదర్శి తాను పనిచేస్తున్న పంచాయతీతో పాటు మరో రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌చార్జిగా ఉండేవారు. దీనివల్ల పరిపాలన మొత్తం స్తంభించేది. ఇలాంటి సమస్యలకు గత పాలనలో చెక్ పడింది. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వాటికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను నియమించడంతో గ్రామాల్లోనే అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, వాటిని డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు సచివాలయం కేంద్రంగా జరిగేవి. సచివాలయాల నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు ధ్రువీకరణ పత్రాలు అందడంతో ప్రజలకు పంచాయతీ అవసరాలు చాలా వరకూ తీరాయి. మరీ ముఖ్యంగా కార్యదర్శి లేక పడే ఇబ్బందులు ప్రజలకు తప్పాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నెమ్మదిగా నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. వలంటీర్ వ్యవస్థ ఎత్తివేసి ఆ భారాన్ని ఉద్యోగులపై మోపింది. ఇదే సమయంలో పంచాయతీ పరిపుష్టి చేస్తామంటూ ఈ వ్యవస్థను మొత్తం ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం రూర్బన్(స్పెషల్ గ్రేడ్)తో కలిపి గ్రేడ్–1,2.3 కింద పంచాయతీ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల కార్యదర్శులకు తప్పనిసరిగా స్థానచలనం కలుగుతుంది. గ్రేడ్లలో వ్యత్యాసం ఉంటే జీతాల విడుదలలో సమస్యలు తలెత్తాయి. పదివేలకు పైబడి జనాభా ఉన్న లేదా రూ.కోటి ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా (రూర్బన్)గుర్తించారు. వీటికి డిప్యూ టీ ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని ప్రత్యేక కార్యదర్శిగా నియమించనున్నారు. రూర్బన్ పంచాయతీలకుగాకు చిన్న పురపాలక సంఘంగా రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు బిల్‌కల్టెకర్లు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్, మేసీ్త్ర, ఇద్దరు సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, డ్రైయిన్ క్లీనర్, ఎలక్ట్రిషియన్, సహాయ ఎలక్ట్రిషియన్, ిపిట్టర్, ట్యాంకు క్లీనర్, ఇంజనీరింగ్ అసిస్టెంటు, వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. గ్రేడ్–1 పంచాయతీ కింద ఏడాది ఆదాయం రూ.30 లక్షల పైబడి రూ.కోటి కన్నా తక్కువ ఆదాయం, 3 వేలకు పైబడి, పది వేలకన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు వీటి పరిధిలోకి వస్తాయి. గ్రేడ్–2 కింద 2–3 వేల జనాభా ఉన్నవి, గ్రేడ్–3 , 2 వేల జనాభా కంటే తక్కువ ఉన్నవి వస్తాయి.
వి.కోట పంచాయతీ
కార్వేటినగరం పంచాయతీ
గ్రేడ్–3 కింద 377 పంచాయతీలు
జిల్లాలో రూర్బన్ కింద గంగవరం, కాణిపాకం, కార్వేటినగరం, వి.కోటలు ఉన్నాయి. గ్రేడ్–1 కింద 100 పంచాయతీలు, గ్రేడ్–2 కింద 140 పంచాయతీలు, గ్రేడ్–3 లో 377 పంచాయతీలు వస్తాయి. గ్రేడ్–1 పంచాయతీలో ఒక్కో పంచాయతీకి 20 మంది, గ్రేడ్–2లో ఒక్కో పంచాయతీకి 12 మంది, గ్రేడ్–3లో 9 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం గ్రేడ్–4, 5 పంచాయతీలను రద్దు చేస్తూ అక్కడి వారికి గ్రేడ్–3, 2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించనున్నారు. కార్యదర్శుల కొరత ఇటీవల పదో న్నతుల నందు దాదాపు భర్తీ చేస్తున్న మిగిలిన ఉద్యోగుల ఖాళీలు, పదోన్నతులు, రెగ్యులైజేషన్ చేస్తే పాలన వేగంగా జరుగుతుంది.
జనాభాకు అనుగుణంగా గుర్తింపు
జిల్లా పునర్విభజన తర్వాత 697 పంచాయతీలు 621కు కుదించారు. ఆ లెక్కన జిల్లాలో గ్రేడ్ –1 పంచాయతీలు 37 కాగా అందులో కార్యదర్శులు గ్రేడ్– 2, 56, కార్యదర్శులు 51, గ్రేడ్–3 ,106 కాగా కార్యదర్శులు 103, గ్రేడ్–4 242 ఉండగా కార్యదర్శులు 185 ఉన్నారు. 2011 జనాభాకు అనుగుణంగా పంచాయతీలను గుర్తింపు చేపటడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జనాభాకు అనుగుణంగా గ్రేడ్‌లు నిర్ణయించాల్సి ఉంది. పంచాయతీల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. పంచాయతీలో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నా యి. వీటిని భర్తీ చేయాలి అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని కోరుతున్నారు. వీరికి అవకాశం కల్పించాల్సి ఉన్నా ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్న జేఏ, బీసీలు సైతం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా డిమాండ్ల పరిష్కరించకుండా వికేంద్రీకరణ చేస్తే ఫలితం ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు.


