కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం తిరుపతి జోన్ దేవదాయశాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని లడ్డూ పోటు, అన్నదానం, క్యూలైన్లు తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. లడ్డూ పోటులో తయారీ విధానాన్ని పరిశీలించిన ఆయన, నాణ్యతను మరింత మెరుగుపరిచి భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్న దానం విభాగంలో భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈవోలు ఎస్‌వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, ప్రసా ద్, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు.
కోడిగుడ్లు నిర్ణీత
తేదీల్లోనే తీసుకోవాలి
వడమాలపేట (పుత్తూరు): ఏజెన్సీ వారు అందజేసే కోడిగుడ్లను నిర్ణీత తేదీల్లో అంగన్‌వాడీ కేంద్రాల వారు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మణ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన వడమాలపేట అంగన్‌వాడీ కేంద్రం, బాలుర ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని, రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో 324 కోడిగుడ్లు అధనంగా ఉండడాన్ని గుర్తించి, ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరారు. 15 రోజులకు ఒకసారి కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా అవి చెడిపోతున్నాయని, అందువల్ల ప్రతి 7 రోజులకు ఒకసారి కోడిగుడ్లు తీసుకోవాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక రిజిస్ట్రర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
నగరపాలక బడ్జెట్ రూ.289.07 కోట్లు
చిత్తూరు అర్బన్: నగరపాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు. పేదవాడల అభివృద్ధికి రూ.10 కోట్లు, ఎస్సీలకు రూ.1.83 కోట్లు, ఎస్టీలకు రూ.1.91 కోట్లు, సీ్త్ర శిశు సంక్షేమానికి రూ.1.27 కోట్లు, విభిన్న ప్రతిభావంతులకు రూ.76 లక్షలు కేటాయించారు.
ఇక ‘ప్రత్యేక’ పాలన!
చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీలోని పాలకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర పురపాలన పరిపాలన శాఖ మంగళవారం ప్రతులు జారీచేసింది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు నగరి, పుత్తూరు మునిసిపాలిటీల్లోని పాలకవర్గాలకు (కౌన్సిల్) ఈనెల 17న గడువు ముగుస్తోంది. కుప్పం మునిసిపాలిటీకి సెప్టెంబర్ వరకు గడువు ఉంది. 2020లో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం.. ఆపై కరోనాతో 2021న ఎన్నికలు పూర్తవడం తెలిసిందే. ఐదేళ్లపాటు పట్టణాలను పాలించిన పాలకుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం ముగ్గు చూపింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణను కొన్ని రోజులపాటు వాయిదా వేయడం మంచిదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది పూర్తిగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులతో నెట్టుకొచ్చే దిశగానే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను ప్రత్యేక అధికారిగా.. పలమనేరు, నగరి, పుత్తూరు... ప్రత్యేక అధికారులుగా నియమించారు.


