విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దు

Mar 11 2026 7:49 AM | Updated on Mar 11 2026 7:49 AM

నగరి : విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని, హాస్టల్‌ వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నగరిలోని పలు హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి వాటి నాణ్యతపై ఆరా తీశారు. గుడ్ల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. నగరి బీసీ హాస్టల్‌ను సందర్శించిన ఆయన ప్రహరీ లోపల ఇతరులకు చెందిన వాహనాలను ఉంచడాన్ని, వాటి కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతుండడాన్ని గమనించి హాస్టల్‌ వార్డన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ హాస్టల్‌లో టిఫిన్‌ రుచిచూసి చట్నీ నాణ్యత కొంచం పెంచాలని సూచించారు. కీళపట్టు పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రేషన్‌ షాపులు, అంగన్‌న్‌వాడీ కేంద్రాల్లో సరుకుల పంపిణీ, నిల్వలపై విచారణ జరిపారు. ఆయన తనిఖీకి వస్తున్నారనే సమాచారంతో పలువురు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆయన వెంట సీ్త్ర,శిసు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి, డీఎస్‌ఓ శంకరయ్య, ఎంఈవోలు శ్రీదేవి, నమశ్శివాయం, సీడీపీవో ఇందిరాప్రియదర్శిని పాల్గొన్నారు.

కీళపట్టులో ఆహారాన్ని రుచి చూస్తున్న ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌

అంగన్‌వాడీ సెంటర్‌లో రికార్డులు తనిఖీ చేస్తున్న ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement