తుక్కురేగ్గొట్టేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

తుక్కురేగ్గొట్టేదెప్పుడు?

Mar 11 2026 7:49 AM | Updated on Mar 11 2026 7:49 AM

● జీఎస్టీ ఎగ్గొట్టి..సామాన్యులకు నోటీసులిచ్చినా చర్యలు శూన్యం ● లబోదిబోమంటున్న బాధితులు

స్క్రాప్‌ స్కాంపై అధికారుల మౌనం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా కేంద్రంగా జరిగిన తుక్కు మాఫియా అక్రమాలు అక్షరాలా రూ.400 కోట్లు. అమాయక ప్రజలను అస్త్రంగా చేసుకుని బినామీ పేర్లతో బోగస్‌ సంస్థలను సృష్టించి సీజీఎస్టీ రిటర్న్స్‌ సొమ్మును కాజేశారు. వందల మందికి నోటీసులు అందడంతో తుక్కు మాఫియా అక్రమా లు వెలుగు చూశాయి. రంగంలోకి దిగిన అధికారు లు విచారణ చేపట్టి మిన్నకుండి పోయారు. మాఫియాపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు.

వెనకుండి నడుపుతున్న తిమింగలాలు ఎవరు

చిత్తూరు కేంద్రంగా స్క్రాప్‌ వ్యాపారి తన అక్రమ సామ్రాజ్యాన్ని మొత్తం నడిపించాడు. కొందరి సహకారంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించా డు. బినామీ పేర్లతో సరుకును విక్రయించి రూ.కోట్లు కొల్లగొడుతూ, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎస్టీని ఎగ్గొట్టాడు. ఇతనిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎటు వెళ్లినా అక్రమ వ్యాపారి దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా వెళుతున్నారని అధికారులు సర్దిచెప్పుకుంటున్నారు. ప్రశ్నించిన అధికారులను బెదిరించడం.. వారిని బదిలీ చేయిస్తానని దబాయిన్నాడంటే అతని వెనుక ఎంత పెద్ద నెట్‌ వర్క్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ సంస్థలను కనుగొన్న అధికారులు ఆపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement