నేతల పెత్తనం | - | Sakshi
Sakshi News home page

నేతల పెత్తనం

Mar 11 2026 7:49 AM | Updated on Mar 11 2026 7:49 AM

నెలనెలా మామూళ్లు

కాణిపాకం/తిరుపతి తుడా: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధికారికంగా మూడు వేలకు పైగా మెడికల్‌ షాపులు ఉన్నాయి. అనధికారికంగా మరో 2,500 వరకు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మెడికల్‌ షాపులు నిర్వహించడం సర్వసాధారణమైపోయింది. ఫార్మసీ అర్హతలు లేని వ్యక్తులే మందులు విక్రయించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దొంగచాటు అమ్మకాలు

కొన్ని మెడికల్‌ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్‌న్‌ కిట్లు, బలమైన మందులు కూడా డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్నారు. ఇది మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే మెడికల్‌ షాపులు ఏర్పాటు చేయడం మరో సమస్యగా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులు తప్పనిసరిగా అదే షాపులో మందులు కొనాల్సిందే. ఇలాంటి మెడికల్‌ షాపుల ద్వారా రోజుకు సుమారు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.

ఈ వ్యవహారంలో భాగంగా ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారు ల పేరిట డబ్బులు తీసుకుంటూ షాపు లు కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. మామూళ్లలో నెలవారీగా అధికారులకు వాటా ఇస్తున్నామని కొందరు బహిరంగగానే చెబుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి నెలవారీగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు మామూళ్లు వసూలు అవుతున్నట్టు సమాచారం. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ అధికారికంగా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఆ శాఖలో ఇద్దరు అధికారులపై ఏసీబీ దాడు లు జరిగినా వారి తీరు మారలేదని.. ఆ శాఖలోని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

మెడికల్‌ షాపుల సంఘం పేరుతో కొందరు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా షాపు ప్రారంభించాలంటే ముందుగా అతని అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి లేకుండా షాపు ప్రారంభిస్తే వివిధ రకాల ఇబ్బందులు కలిగిస్తున్నట్లు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ షాపు రిజస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఆ వ్యక్తికి రూ.20 వేల నుంచి రూ.50వేల ముట్టజెప్పాలి. మెడికల్‌ షాపులు విక్రయించే మందులు, మాత్రలు కూడా అతను సూచించిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement