చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, కెప్టెన్ పి.సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించారు. కలెక్టరేట్‌లోని సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆ శాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు. చిత్తూరు జిల్లా మాజీ సైనికుల సంఘం నిర్మించిన యుద్ధస్మారకానికి డైరెక్టర్ రూ.2,72,550 చెక్కును అందజేశారు. జెడ్పీ కార్యాలయం ఎదురుగా సైనిక్ భవనం నిర్మానానికి 5 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. మాజీ సైనికులు, సంఘ ప్రతినిధులతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, వైఎస్సార్‌సీపీ ఉద్యోగ, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.


