మల్లప్పకొండపై అగ్నికీలలు | - | Sakshi
Sakshi News home page

మల్లప్పకొండపై అగ్నికీలలు

Mar 2 2026 7:50 AM | Updated on Mar 2 2026 7:50 AM

మల్లప్పకొండపై అగ్నికీలలు

మల్లప్పకొండపై అగ్నికీలలు

గుడుపల్లె: మండలంలోని స్వర్ణగిరి మల్లప్పకొండపై మంటలు చెలరేగాయి. దీంతో వేలాది పచ్చ ని చెట్లు ఆహుతి అవుతున్నాయి. సాయంత్రం ఆకతాయిలు అడవికి నిప్పుపెట్టడంతో గాలికి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండంతో ఏమీ చేయలేమని అటవీ అధికారులు చేతులెత్తేశారు. మంటలు రాత్రికి కొండ చుట్టూ వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఆగని గజ దాడులు

గుడిపాల: గుడిపాల మండలానికి కుంకీ ఏనుగులు వచ్చినా ఫలితం కనిపించడం లేదు. ఏనుగులు ఒక్కో రోజు ఒక్కో ప్రాంతం వైపు వెళుతూ యథేచ్ఛగా పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి వెప్పాలమాను గ్రామ సమీపంలో అరటి, వరి పంటలను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు స్పందించి అక్కడికి వెళ్లే సమయంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయా యి. ఆదివారం ఉదయం కుంకీ ఏనుగులను వెప్పాలమానుచేను గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఎనుగులు వెళ్లిన అటవీ ప్రాంతంలోకి తీసుకెళతామని, తద్వారా ఏనుగుల ఆచూ కీని గుర్తించి మచ్చిక చేసుకుని దూర ప్రాంతాలకు తరలిస్తామని డీఆర్‌వో కరణ్‌సింగ్‌ తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement