చెరువులో యువకుడి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

చెరువులో యువకుడి మృతదేహం

Mar 2 2026 7:50 AM | Updated on Mar 2 2026 7:50 AM

చెరువ

చెరువులో యువకుడి మృతదేహం

బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లె సమీపంలోని దర్గా వద్ద ఉన్న పెద్దచెరువులో ఆదివారం సాయంత్రం యువకుడి మృతదేహం తేలడంతో పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్లు గ్రామానికి చెందిన నరశింహులు కుమారుడు మురళీ (30) బైరెడ్డిపల్లెలోని శ్రీ శేషాద్రిస్వామి సర్కిల్‌ వద్ద సీఎస్‌ఈ సెంటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో బైరెడ్డిపల్లెకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు బైరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సాయంత్రం పెద్దచెరువులో మురళీ శవం తేలడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

చెరువులో యువకుడి మృతదేహం 
1
1/1

చెరువులో యువకుడి మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement