తొలి తెలుగు పద్యకవయిత్రి మొల్ల | - | Sakshi
Sakshi News home page

తొలి తెలుగు పద్యకవయిత్రి మొల్ల

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

తొలి తెలుగు పద్యకవయిత్రి మొల్ల

తొలి తెలుగు పద్యకవయిత్రి మొల్ల

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): తెలుగు సీమలో తొలి తెలుగు పద్య కవయిత్రిగా మొల్ల ఎనలేని కీర్తిని గడించారని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌ తెలిపారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బ్రెయిన్‌ బాక్స్‌ అకాడమీలో ఆదివారం భారతీయ తెలుగు రచయితల సమాఖ్య, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్‌ సంయుక్తంగా కవయిత్రి మొల్ల సాహితీ వైభవం పేరిట కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ తెలుగుధాత్రిలో మొల్లచరితం పరిమళభరితమన్నారు. సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు, అధ్యక్షుడు సి.నారాయణ స్వామి మాట్లాడుతూ మొల్ల ఆ నాడు శ్రీకృష్ణదేవరాయల నుంచి కవయిత్రి తల్లీ అని ప్రశంసలు అందుకోవడంతోపాటు రామాయణ కథతో విశ్వవిఖ్యాతిగాంచారని పేర్కొన్నారు. రచయితలు నందిపాటి చక్రపాణి, తోట గోవిందన్‌ మాట్లాడుతూ మొల్ల సాహిత్యంలో ప్రకృతి భావాభ్యుదయ పద్యాంశం తాండవిస్తోందన్నారు. అనంతరం 30 మందికి మొల్ల జాతీయ పురస్కారాలు –2026, ప్రశంసా పత్రాలను డీఆర్వో చేతు ల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో రచయితలు ఎం.శ్రీరాజు, వి.రఘుపతి, జి.గోవిందయ్య, కన్నయ్య నాయుడు, బి.చక్రవర్తి, వరలక్ష్మమ్మ, వి.ఉష, ఎస్‌.యువన్య, కీర్తి ప్రియ, ఎస్‌.మునీంద్ర, కె.దామోదరాచారి, ఎం.జగదీష్‌, సంఘ సేవకులు కోటీశ్వర మొదలియార్‌, శ్రీనివాసమూర్తి, నేచర్‌ మురళి, కె.ఎర్రయ్య, మల్లి ఆచారి, బ్రెయిన్‌ బాక్స్‌ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్‌.యువన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement