సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ప్రతి ఏటా విజ్ఞానం మేళవింపుగా జరిగే టెక్నో కల్చరల్ ఫెస్ట్ తిరుత్సవ–2026 ఈ ఏడాది కూడా వేడుకగా సాగింది. ఐఐటీ ప్రాంగణంలో తిరుత్సవ సంబరాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. ఆదివారం మర్డర్ మిస్టరీ ఛేదించడంతో విద్యార్థులు ఉత్కంఠత చూపుతూ సాంకేతిక విజ్ఞానాన్ని మేళవించారు. స్క్విడ్ గేమ్, బ్లైండ్ ఫొటోగ్రఫీ పోటీల్లో ఉత్సుకతతో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వర్క్‌షాపుల్లో పాల్గొన్న ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు సాధించేందుకు ఐఐటీ ప్రొఫెసర్లు సూచనలు, విలువైన సమాచారాన్ని అందించారు. క్యాంపస్ అంతటా ఆలోచింపజేసే విభిన్న చిత్రాలు, పోస్టర్లను ఐఐటీ విద్యార్థులు రూపొందించి ప్రదర్శించారు.
తిరుత్సవ మ్యూజికల్ నైట్ నేటికి వాయిదా
ఐఐటీ వేదికగా జరుగుతున్న తిరుత్సవ్ మ్యూజికల్ నైట్ సోమవారానికి వాయిదా పడింది. ఆడియో కంట్రోలర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సిబ్బంది ఆదివారం రాత్రి మూడు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, పీఆర్‌ఓ చమన్‌మెహతా పరిస్థితిపై సమీక్షించి సినీ గాయకులు హేమచంద్ర, అనుజ్ రెహన్ ప్రదర్శనలను సోమవారం కొనసాగిస్తామని చెప్పారు.
ఉత్సవాల్లో ఐఐటీ విద్యార్థుల ఉత్సాహం
ధగధగలాడుతున్న తిరుపతి ఐఐటీ క్యాంపస్
సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం
సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం
సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం


