కుప్పిగానిపల్లె సచివాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

కుప్పిగానిపల్లె సచివాలయంలో చోరీ

Jan 30 2026 7:00 AM | Updated on Jan 30 2026 7:00 AM

కుప్ప

కుప్పిగానిపల్లె సచివాలయంలో చోరీ

గుడిపాల: మండలంలోని కుప్పిగానిపల్లె సచివాలయంలో బుధవారం రాత్రి ఓ ప్రింటర్‌ చోరీకి గురైంది. సచివాలయంలోని రికార్డులను చించివేశారు. గత రెండు రోజుల క్రితం పేయనపల్లె సచివాలయంలో మూడు ప్రింటర్లు, ఒక ల్యాప్‌ టాప్‌ను చోరీ చేసిన విషయం తెల్సిందే. గత నాలుగు నెలల క్రితం కుప్పిగానిపల్లె రైతు సేవా కేంద్రంలో ఉన్న టీవీని కూడా దుండగులు దొంగలించుకొని వెళ్లారు. వరుస దొంగతనాలపై సచివాలయ సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదుచేశారు.

జిల్లాలో 55 పశు ఆరోగ్య శిబిరాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం ): జిల్లా వ్యాప్తంగా గురువారం 55 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించినట్టు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ క్యాంపునకు పాడి రైతుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 1,348 మంది రైతులు....7,851 పశువులకు చికిత్స చేయించుకున్నారన్నారు. దీంతో పాటు గొర్రెలు, మేకలు, కోళ్లకు వైద్యంతో పాటు వ్యాక్సినేషన్‌ ఇచ్చా మని ఆమె పేర్కొన్నారు.

5న సంకటహర గణపతి వ్రతం

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 5వ తేదీన సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నట్టు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. భక్తుల కోరిక మేరకు మూడు బృందాలుగా వ్రతం జరిపిస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి 10గంటలు, 11నుంచి 12గంటలు, సాయంత్రం 5నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

చిత్తూరులో దొంగ అరెస్టు

– నాలుగు మోటారు సైకిళ్ల స్వాధీనం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో మోటారు సైకిళ్లు (బుల్లెట్లు) చోరీ చేసే ఎల్‌.రాజ్‌కుమార్‌ (25) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ నెట్టికంటయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చిత్తూరు నగరంలో పలుచోట్ల మోటారు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరువారం కూడలి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పారిపోగా, రాజ్‌కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన పూవరసన్‌తో కలిసి తాను కూడా మోటారు సైకిళ్లు చోరీ చేసినట్లు రాజ్‌కుమార్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడు దాచి ఉంచిన రూ.8 లక్షల విలువ చేసే నాలుగు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బావిలో చిరుత మృతదేహం

చిత్తూరు కార్పొరేషన్‌: నగర పరిఽధిలోని సీజీపల్లె వద్ద ఓ బావిలో గురువారం చిరుత మృతదేహం కనబడింది. సీజీ పల్లె సమీపంలోని పాడుపడిన బావిలో చిరుత మరణించి ఉన్నట్లు స్థానికంగా ఆవులు మేపేవారు గుర్తించి అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని బావి చుట్టూ పిచ్చిమొక్కలను తొలగించి చిరుత మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. చిరుత వచ్చి కాలుజారి బావిలో పడిందా లేదా ఎవరైనా వేటగాళ్లు చంపి బావిలో వేశారా అనే అంశంపై అటవీ శాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. దాదాపు మూడు రోజుల క్రితం బావి లో పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

పకడ్బందీగా ‘స్పర్శ’

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి స్పర్శ కార్యక్రమాలు 30 నుంచి ఫిబ్రవరి 13వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.

కుప్పిగానిపల్లె  సచివాలయంలో చోరీ 
1
1/2

కుప్పిగానిపల్లె సచివాలయంలో చోరీ

కుప్పిగానిపల్లె  సచివాలయంలో చోరీ 
2
2/2

కుప్పిగానిపల్లె సచివాలయంలో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement