గ్రూప్–2లో సత్తా చాటిన నాగార్జున
– ముచ్చటగా మూడో ఉద్యోగం
బంగారుపాళెం: మండలంలోని కూర్మాయిపల్లెకు చెందిన నాగార్జున ఇటీవల విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటి మూడో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన గోవిందయ్య, వసంత దంపతుల కుమారుడు నాగార్జున గ్రూప్–2 పరీక్ష రాసి సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించాడు. నాగార్జున గతంలో మొదట సీఐఎస్‌ఐలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. ఎనిమిదేళ్లు పనిచేశారు. అటు తరువాత పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి రెండో సారి ట్రైనీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం కడప జిల్లాలో పనిచేస్తున్నారు. ఇటీవల గ్రూప్–2 పరీక్షలో సత్తా చాటి మూడో సారి సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన్ను అభినందించారు.
మళ్లీ కత్తికి.. కొండకు గొడవ!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కత్తికి, కొండకు (ఇద్దరు అధికారులను కార్యాలయంలో కత్తి, కొండ అని పలుకు తారు) మళ్లీ గొడవ మొదలైంది. గతంలో వీళ్ల మధ్య గొడవొచ్చి పెద్దలు సర్దుబాటు చేశారు. మళ్లీ రెండు రోజులుగా గొడవపడుతున్నారు. ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నారు. ఈ గొడవలో ఎవరు నెగ్గుతారో చూడాలని కార్యాలయ అధికారులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి తెలిసినా ఎవరికి సర్దిచెప్పాలో తెలియక మనకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు.


