లింకుల కలకలం! | - | Sakshi
Sakshi News home page

లింకుల కలకలం!

Jan 17 2026 8:23 AM | Updated on Jan 17 2026 8:23 AM

లింకు

లింకుల కలకలం!

వాట్సాప్‌ల్లో బ్యాంకులు.. అశ్లీల వీడియోల పేరిట లింకులు ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. అన్ని గ్రూపులకు మెసేజ్‌లు జిల్లా అధికారుల నుంచి సామాన్యుల వరకు బాధితులే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్న పోలీసులు

జిల్లాలోని అధికార వెబ్‌సైట్లో అశ్లీల వీడియోల లింకులు కలకలం రేపాయి. ఏకంగా సమాచారశాఖ డెప్యూటీ డైరెక్టరేట్‌ పేరిట ఈ వీడియోలు రావడం కలవరానికి గురిచేశాయి. ఒకరిద్దరికి ఏపీకే ఫైళ్లు రావడం.. వారు వాటిని క్లిక్‌ చేయడం.. ఆపై అన్ని గ్రూపుల్లో హల్‌చల్‌ చేయడం ఇట్టే జరిగిపోయింది. ఇలాంటి అన్‌నౌన్‌ నంబర్ల నుంచి వచ్చే లింకులు.. మెసేజ్‌లకు రెస్పాన్స్‌ కావొద్దని పోలీసు యంత్రాంగం సూచిస్తోంది. లేకుంటే వ్యక్తి గత డేటా కూడా చోరీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి పేదల దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. బంగారుపాళెం మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన వైఎస్సార్‌ అభిమాని, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపతిరాజు గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన తల్లిదండ్రుల చిత్ర పటాలతో పాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్ర పటం ఉంచి కొత్త బట్టలు పెట్టి పూజలు చేశారు. బంధువులు, స్నేహితులను పిలిచి మధ్యాహ్నం అన్నదానం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి చెందినప్పటి నుంచి ప్రతి ఏటా బట్టలు పెట్టుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని, అందువల్లే ఆయనను దేవుడిలా కొలుచుకుంటున్నట్టు పేర్కొన్నారు. – బంగారుపాళెం

పోర్న్‌ వీడియో పేరిట వాట్సాప్‌లోని సందేశం

చిత్తూరు అర్బన్‌: కలెక్టర్‌, డీఆర్‌వో, ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, డ్వామా, డీఆర్‌డీఏ లాంటి జిల్లా అధికారులు ఉంటున్న వాట్సాప్‌ గ్రూపులో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఏంటని పలువురు వాటిని ఓపెన్‌ చేస్తే.. గుండె ఆగినంత పనయ్యింది. చూడడానికి మైనర్‌ పిల్లల్లా ఉన్న ఇద్దరి ప్రైవేటు వీడియోలు (పోర్న్‌), ఫొటోలు ఆ గ్రూపులో ప్రత్యక్షమయ్యాయి. అది కూడా ఏకంగా సమాచారశాఖ డిప్యూడీ డైరెక్టర్‌ పేరిట ఈ వీడియోలు రావడంతో అధికారులు బిత్తరపోయారు. ఇది ఏ ఒక్కరికి పరి మితమైనది కాదు.. బ్యాంకులు, వ్యవసాయం, క్రిప్టో కరెన్సీ పేరిట వచ్చే మెసేజ్‌, లింకులను క్లిక్‌ చేసే చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఏం చేయాలి?

ఏపీకే ఫైళ్లను క్లిక్‌ చేసిన క్షణం నుంచే ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ కావడం, ఆ వెంటనే సదరు ఫోన్లో ఉన్న ఇతర వాట్సాప్‌ గ్రూపుల్లోకి ఈ సందేశం వెళ్లిపోవడం ఇట్టే జరిగిపోతుంది. ఇలా గొలుసుకట్టుగా వేలాది ఫోన్లకు వెళ్లాయి. ఇందులో రాష్ట్ర మంత్రిత్వశాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న గ్రూపులతోపాటు స్నేహితులు, విద్యార్థుల గ్రూపులు కూడా ఉన్నా యి. మొదట ఇంటర్నెట్‌ డేటా ఆఫ్‌ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి సదరు ఏపీకే యాప్ని అన్‌–ఇన్‌స్టాల్‌ చేయాలి. యాంటీ వైరస్‌ యాప్‌తో ఫోన్‌ను పూర్తిగా స్కాన్‌ చేయాలి. బ్యాంకింగ్‌ యాప్లు, సామాజిక మాధ్యమాల అకౌంట్లు, ఈ–మెయిల్‌ ఎకౌంట్‌ పాస్వర్డులు మార్చుకోవడం ఉత్తమం. ఒకవేళ మాల్వేర్‌ యాప్‌ అన్‌–ఇన్‌స్టాల్‌ కాకపోతే ఫోన్‌ను సేఫ్‌ మోడ్‌లో రీస్టార్ట్‌ చేసి అన్‌–ఇన్‌స్టాల్‌ చేయాలి.

చెరగని జ్ఞాపకం..

హ్యాక్‌ కాదు

నిజానికి ఏదైనా ఓ వాట్సాప్‌ గ్రూపులో ఏపీకే (ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌) పేరిట మెసేజ్‌ వస్తే దాన్ని ఓపెన్‌ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఒకవేళ ఏపీకే ఫైల్‌ను క్లిక్‌ చేస్తే.. ఆ నంబరును ఫోన్‌లో సేవ్‌ చేసుకున్న అన్ని గ్రూపుల్లో మెసేజ్‌ వెళ్లిపోతుంది. జిల్లాలోని పలు గ్రూపుల్లో గురువారం వైరల్‌ అయిన పోర్న్‌ వీడియోలు కూడా ఇదే కోవలోకి వస్తున్నాయి. ముందుగా ఇద్దరి వ్యక్తిగత ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. 19 నిముషాలున్న పార్టు –2 వైరల్‌ వీడియో చూడాలంటే కింద ఉన్న లింకును క్లిక్‌ చేయాలని మెసేజ్‌ వచ్చింది. దీంతో పలువురు పార్టు –2 చూడడానికి ఏపీకే ఫైల్‌ను క్లిక్‌ చేశారు. ఫలితంగా వాళ్ల ప్రమేయం లేకుండానే చాలా గ్రూపుల్లోకి అశ్లీల ఫొటోలు వైరల్‌ అయిపోయాయి.

క్లిక్‌ చేశారో.. అంతే సంగతి!

లింకుల కలకలం! 1
1/2

లింకుల కలకలం!

లింకుల కలకలం! 2
2/2

లింకుల కలకలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement