● అప్పుడు పెద్దపండగ వస్తా ఉండాదంటే బ్యాంకులో దుడ్డు పడే
గుడిపాల మండలం, నంగమంగళం గ్రామంలో.. గ్రామస్తుల మాట–మంతి
‘అవునా, ఇపుడు ప్రజలకు ఏది అవసరమో దాన్ని ప్రైవేటు చేసేస్తా ఉండారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు ఇస్తామంటా ఉండారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు.. కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టేదానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. పేదలు డాక్టర్లయ్యేదానికి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను మెయింటెన్ చేయరనా..? విడ్డూరంగా ఉండాది. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కోవిడ్ సమయంలో జగన్ అందించిన సేవలు బతికున్నంత వరకు మర్చిపోలేమునా. కానీ దాన్ని చెప్పుకునేదాంట్లో ఆయన ఇంట్రెస్ట్ చూపీలేదు. ఇపుడు ఏమీ చేయకపోయినా పబ్లిసిటీకి మాత్రం రూ.కోట్టు ఖర్చు పెడతా ఉండారు.’
– శ్రీనివాసులు, వ్యాపారం, హైదరాబాద్.
‘నువ్వు చెప్పేది నిజమే శీనా, ఇంతకుముందు పతీ నెలా పదో తేదీలోపు వ్యాను (104)వచ్చేది. ఇక్కడే పరీక్షలు చేసి.. బీపీ, షుగర్‌తో పాటు ఏ ఇబ్బంది ఉన్నా మందులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడా ఊసేలేదు. పీహెచ్‌సీలో మందులు ఉండవు. ఇంతకుముందు ఇచ్చిన పట్టా పాసుపుస్తకమే మళ్లీ ఇస్తా ఉండారు. దానికి రూ.వెయ్యి ఇవ్వాలి. సచివాలయాల్లో ప్రజలకు కావాల్సిన సేవలు ఏదీ అందేదిలేదు. అడిగితే సర్వే డ్యూటీకి వెళతా ఉండాము అని చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆరు కి.మీ దూరం ఉన్న మండలాఫీసుకు పోవాల్సిందే.’
– కలై అరసి, మాజీ ఎంపీటీసీ
● అప్పుడు పెద్దపండగ వస్తా ఉండాదంటే బ్యాంకులో దుడ్డు పడే
● అప్పుడు పెద్దపండగ వస్తా ఉండాదంటే బ్యాంకులో దుడ్డు పడే


